10ఇయర్స్‌చాలెంజ్‌ పైన భావోద్వేగంతో పోస్ట్ వేసిన యువరాజ్ సింగ్ భార్య

#10ఇయర్స్‌చాలెంజ్‌, #10ఇయర్స్‌చాలెంజ్‌ ప్రస్తుతం సోషల్ మీడియా లో #10ఇయర్స్‌చాలెంజ్‌ పేరిట పోస్ట్స్ ఉదృతంగా పడుతున్నాయి, దీన్ని ఎవరు మొదలెట్టారో తెలియదు కానీ సామాన్యుల నుండి సెలబ్రిటీ ల వరకు చాలా మంది ఇందులో పాల్గొంటున్నారు. 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం. అప్పుడు ఏ స్థితి లో ఉన్నాం ఇప్పుడు ఏ స్థితి లో ఉన్నాం అనేదే ఈ #10ఇయర్స్‌చాలెంజ్‌.

ఈ #10ఇయర్స్‌చాలెంజ్‌ లో యువరాజ్ సింగ్ భార్య హేజిల్‌ కీచ్‌ కూడా పాల్గొన్నారు, ఆమె ఎంతో ఉద్వేగానికి లోనవుతూ పోస్ట్ చేసారు, ఆమె పెట్టిన పోస్ట్ ఇదే : “22 నుంచి 32 ఏళ్లు. ఇంత దూరం ప్రయాణించానా! అప్పుడు డిప్రెషన్‌ను జయించేందుకు యుద్ధం చేసేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని, జుట్టుకు చిక్కగా రంగేసుకునేదాన్ని. నా చుట్టూ ఉన్నవాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి పనులన్నీ చేసేదాన్ని. వారిని సంతోషంగా ఉంచేందుకు బాధలన్నీ పంటిబిగువనే భరించాను. కానీ ఈరోజు పూర్తి విశ్వాసంతో మాట్లాడగలను. ఎవరు ఏమనుకుంటారోనన్న భయం లేదు. ఇప్పుడు ధైర్యంగా జుట్టు కత్తిరించుకుంటున్నా. నా సంతోషం కోసమే నేను బతుకుతున్నా. ఇం‍త ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటానని ఎప్పుడూ కనీసం ఊహించలేదు. 10ఇయర్స్‌చాలెంజ్‌ మొదలుపెట్టిన వారికి కృతఙ్ఞతలు’ అంటూ హేజిల్‌ కీచ్‌ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్‌ చేశారు.

అండగా నెటిజన్స్ :

హేజిల్‌ కీచ్‌ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చుసిన వాళ్లంతా ఆమెకు సపోర్ట్ గా నిలిచారు, చాలా మంది వారి జీవితాన్ని వారి కోసం కాకుండా ఇతరుల కోసం బ్రతుకుతుంటారని, అందులో ఎటువంటి అర్ధం ఉండదని, మన జీవితం కోసం మనం బ్రతకడం లో తప్పు లేదని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పోస్టుకి నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. మీలాంటివారు మాకు ఆదర్శం అంటూ నెటిజన్లు కామెంట్ల చేస్తున్నారు.

టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ కూడా #10ఇయర్స్‌చాలెంజ్‌ పైన విన్నూతంగా స్పందించింది. చాలా మంది సెలబ్రిటీ లు వారి 10 సంవత్సరాల పిక్ పెట్టి, ఇప్పటి పిక్ పెట్టి ఈ 10 సంవత్సరాల్లో ఎటువంటి మార్పు వచ్చింది, ఏంటి అని ముచ్చటిస్తున్నారు, సోషల్ మీడియా లో ఒక్క సారి ఏదైనా వైరల్ అయ్యింది అంటే ఇంక దాన్ని ఎవ్వరు ఆపలేరు.

2019 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ స్థానం కోసం చాలా కష్టపడుతున్నాడు, 2019 వరల్డ్ కప్ తరువాత ధోని ODI లకి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. యువరాజ్, ధోని లకు 2019 వరల్డ్ కప్ ఏ లాస్ట్ అని చెప్పొచ్చు. వీరిరువురు కలిసి ఆడితే చూడాలని కొన్ని కోట్ల మంది ప్రేక్షకుల కోరిక.

 

Reply