వినయ విధేయ రామ.. ఓవర్సీస్ లో తూఫాన్ రికార్డు జస్ట్ మిస్..!!

వినయ విధేయ రామ సినిమా కు నెగటివ్ టాక్ వచ్చినా, ఆంధ్ర తెలంగాణ లో బాగానే కలెక్ట్ చేసింది, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల్లో పోలిస్తే ఎక్కువే కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా కు నష్టాలు కంఫర్మ్, కానీ ఓవర్సీస్ తో పోలిస్తే ఆంధ్ర తెలంగాణ లో అంత ఎక్కువగా నష్టాలు రావు. విడుదల అయిన నాటి నుండి ఇప్పటి వరకు ఈ సినిమా 50 కోట్లకు పైగా షేర్ ని రాబట్టింది.

ఓవర్సీస్ భారీ దెబ్బ..

మాములుగా బోయపాటి సినిమాలకు ఓవర్సీస్ లో పెద్దగా మార్కెట్ ఉండదు, కానీ రామ్ చరణ్ గత చిత్రాలు అయిన ధ్రువ, రంగస్థలం చిత్రాలు ఓవర్సీస్ లో భారీగా ఆడాయి, ముఖ్యంగా రంగస్థలం ఓవర్సీస్ లో 4.5M$ పైగా కలెక్ట్ చేసింది, ఒక్క అమెరికా లోనే ఈ చిత్రం 3.5M$ వసూలు చేసింది. ఇంత భారీ హిట్ తరువాత వస్తున్న చిత్రం కాబట్టి ఎంత బోయపాటి సినిమా అయినా కచ్చితంగా చరణ్ తన స్టామినా తో ఓవర్సీస్ లో లాక్కొస్తాడు అని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ నమ్మకం పెట్టుకున్నారు, కానీ సీన్ రివర్స్ అయ్యింది.

4.5M$ టు 0.4M$.. :

రంగస్థలం తో ఓవర్సీస్ లో నాలుగున్నర మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన రామ్ చరణ్, వినయ విధేయ రామ సినిమా తో కనీసం ఓవర్సీస్ అంతా కలిపి హాఫ్ మిలియన్ మార్క్ ని కూడా దాటలేకపోయాడు. ఓవర్సీస్ లో మాస్ మూవీస్ ని జనాలు పెద్దగా పట్టించుకోరు, కానీ ముందు సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఎంత నెగటివ్ టాక్ వచ్చినా కనీసం 1 మిలియన్ డాలర్ అయినా కలెక్ట్ చెయ్యాలి.

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి లాభం శూన్యం.. :

ఈ సినిమా ను ఓవర్సీస్ లో భారీ మొత్తం లోనే కొన్నారు, అయితే వచ్చిన కలెక్షన్స్, డెఫిసిట్స్ కి, ప్రొమోషన్స్ కి అంతా కలిపి డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ నష్టం అని సమాచారం. ఓవర్సీస్ లో ఈ సినిమా డిసాస్టర్ లిస్ట్ లో ఒకటి గా నిలిచిపోయింది. రామ్ చరణ్ కెరీర్ లో తూఫాన్ సినిమా తరువాత ఓవర్సీస్ లో ఆ రేంజ్ ప్రదర్శన కనబరిచిన చిత్రం వినయ విధేయ రామ.

ఆంధ్ర, తెలంగాణ లో పర్లేదు.. :

ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలను ఎదురుకోక తప్పదు, కానీ భారీ నష్టాలను అయితే చూడరు. పండుగ సీజన్లో కాబట్టి రామ్ చరణ్ స్టామినా తో ఆంధ్ర తెలంగాణ లో నెగటివ్ టాక్ వచ్చినా లాక్కొచ్చాడు. ఇక మళ్ళీ రాజమౌళి సినిమా వరకు ఇంకే సినిమాలోనూ కనిపియ్యడు మెగా పవర్ స్టార్. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో.? మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి ఎప్పుడు తీరుస్తుందో.

 

Reply