96 సినిమా ని చూసిన ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు, తమ్మారెడ్డి భరద్వాజ్ 96 మూవీ మీద కామెంట్స్ చేసారు, అసలు అంతలా ఆ మూవీ లో ఏముంది.?

96 మూవీ చుసిన ప్రతి ఒక్కరు ఆ మూవీ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు, ఒక సినిమా ని ఎంత అందంగా తియ్యగలరో, అంత అందంగా తీశారు, నటీనటుల నటన అయితేనేమి, నేపధ్య సంగీతం అయితేనేమి, సినిమాటోగ్రఫీ అయితేనేమి, ఇలా  ఒకటి కాదు, రెండు కాదు, అన్ని వర్గాల్లోను ఈ సినిమా మెరిసిపోయింది.

విజయ్ సేతుపతి, త్రిష ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు, వాళ్ళు వారి పాత్రల్లో జీవించేసారు, ఒక సన్నివేశం లో త్రిష నవ్వినప్పుడు, ఆ సీన్ చూస్తున్న మనందరి కళ్లలోనుండి తెలీకుండానే నీళ్లు వచ్చేస్తాయి. సినిమా ఏ రేంజ్ లో ఉంది అని చెప్పడానికి ఈ సీన్ ఒక ఉదాహరణ మాత్రమే.

ఇటీవల తమ్మ రెడ్డి భరద్వాజ్ 96 చిత్రాన్ని చూసారు, ఆ సినిమాని చుసిన తరువాత నుంచి మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు. 96 చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తారు ఆయన

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ:

అసలు మనం ఇలాంటి కథలు ఎందుకు ఆలోచించడం లేదు. విజయ్ సేతుపతి నాలుగైదేళ్ల క్రితం పిజ్జా సినిమా చేశాడు. అదే అతడి ఫస్ట్ పిక్చర్. ఇప్పటికి అతడి ముప్పై సినిమాలు దాటిపోయాయి. అతడు చేసే సినిమాలు ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఆయన్ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతడు ఎన్ని సినిమాలు చేశాడు అనేదానికన్నా సినిమాకు సినిమాకు సంబంధం లేదు. ప్రతి సినిమా డిఫరెంటుగా ఉంది.

ఆ డైరెక్టర్ కథ ఎలా ఆలోచించాడు? ప్రొడ్యూసర్ ఇలాంటి సినిమా చేయడానికి ఎలా ధైర్యం చేశాడు? పెద్ద హీరో అయి ఉండి ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాలేదు. ముందు ఆ సినిమా తీయడానికి భయమేసి గుండె ఆగి చనిపోవాలి. అటువంటిది ఆ సినిమా తీశారు. ఈ సినిమాను సూపర్ హిట్ చేసిన తమిళ ప్రేక్షకులను అభినందించకుండా ఉండలేం. ఆ సినిమా మొత్తం మీద హీరో హీరోయిన్లు అసలు ముట్టుకోలేదు. ఒక ఒక చోట చిన్న హగ్ ఉంది అది కూడా వాళ్ళ చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను మర్చి ఇలా జరిగుంటే అని చూపించారు, అందులో ఆ హాగ్ ఉంది. అది తప్ప ఒకరినొకరు టచ్ కూడా చేసుకోలేదు. రెండున్నర గంటల సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజయ్ సేతుపతి, త్రిష పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది

నేను ఈ సినిమా ని పైరసీ లో చూసాను, అలా చూడటం తప్పే, త్వరలో తెలుగులో వస్తుంది కనుక మీరు ఎవరు ఈ సినిమాని పైరసీ లో చూడకండి అని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తెలిపారు.

Watch Videos :

 

Reply