హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన టాక్సీవాలా! అదిరిపోయిన టాక్సీవాలా కలెక్షన్స్..!

కలెక్షన్స్ లో దుమ్ము లేపుతున్న విజయ్ దేవరకొండ. పాజిటివ్ టాక్ తో విజయ పదం లో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రం యు.ఎస్.ఎ లో హాఫ్ మిలియన్ మార్క్ ను నిన్నటితో క్రాస్ చేసింది, టాక్సీవాలా చిత్రం 1 మిలియన్ మార్క్ ని ఈ వారం లో దాటుతుందని అంచనా.

రిలీజ్ కి ముందే సినిమా మొత్తం లీక్ అయినా, రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ తో జనాలని విపరీతంగా ఆకట్టుకుంది, ముఖ్యంగా సినిమా లో కామెడీ ఫ్యామిలీస్ ని బాగా ఆకట్టుకుంది. నటి నటుల నటన, కామెడీ, సెంటిమెంట్, పాటలు, నేపధ్య సంగీతం, ట్విస్ట్స్.. ఇలా అన్ని రంగాల్లో ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో 15 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది ఈ సినిమా. విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా యూత్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తరువాత ఈ తరం హీరో లలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ ఆడియన్స్ లలో, అమ్మాయిలలో విజయ్ క్రేజ్ మాములుగా లేదు. గీత గోవిందం ఘన విజయం తరువాత నోటా సినిమా తో అపజయం అందుకున్న విజయ్ దేవరకొండ, మళ్లీ టాక్సీవాలా చిత్రం తో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. 2.0 సినిమా విడుదల వరకు టాక్సీవాలా చిత్రానికి పోటీ ఇచ్చే వేరే ఏ పెద్ద సినిమా లేకపోవడం తో, కచ్చితంగా 30CR-40CR వరకు షేర్ ని రాబట్టగలదు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. 5 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇంతటి లాభాలను తెచ్చి పెడుతుందని ప్రొడ్యూసర్స్ కూడా ఊహించి ఉండరు.

Reply