ప్రభుత్వ కార్యాలయం లో స్వీపర్ గా పనిచేస్తూ తన కుమారులను కలెక్టర్ , ఐఏఎస్ , డాక్టర్ చేసింది

ఆమె ప్రభుత్వ కార్యాలయం లో స్వీపర్.  సుమిత్ర దేవి గారు 30 సంవత్సరాలుగా పని చేస్తున్నారు ,ఈ రోజు ఆమె పని చేసే చివరి రోజు . పదవి విరమించే సమయం వచ్చింది . ఆరోజు ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె రోజులాగే ఆఫీసులో అన్ని గదులు ఊడ్చి సిబ్బందితో రోజు మాదిరే సంతోషంగా గడుపుతూ ఉంది,

Sumitra devi

బహుశా ఎవరు ఊహించివుండరు ఆమె సన్మానం అంత గొప్పగా ఉంటుంది అని. సిబ్బంది మాత్రం మమ్మల్ని విడిచి పోతున్నావు అంటూ భావోద్వేగాలతో కళ్ళు చెమర్చుతున్నాయి. సాయంత్రం 5 గంటలయ్యింది, సిబ్బంది బొకేలతో హడావుడిగా వున్నారు, ఇంతలో రెండు కార్లు వచ్చాయి , అంతలో జిల్లా కలెక్టర్ కారు వచ్చి ఆగింది, కలెక్టర్ కారు దిగి నేరుగా అస్వీపర్ వద్దకు వెళ్లి ఆమె కాళ్లకు దండం పెట్టాడు, మరో పెద్దకారు వచ్చి ఆగింది, ఆకారులో పెద్ద పేరున్న సివిల్ ఇంజనీర్. ఆయన కూడా వచ్చి అస్వీపర్ కాళ్లకు దండం పెట్టాడు. మరో కారు వచ్చింది, ఆకారులో పేరున్న గుండె వైద్య నిపుణులు వచ్చి రాగానే ఆస్వీపర్ కాళ్ల మీద నన్ను క్షమించమ్మా 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను అని ప్రాధేయపడ్డాడు.

ఈ ముగ్గురూ (కలెక్టర్, సివిల్ ఇంజనీర్, గుండె వైద్య నిపుణులు) అస్వీపర్ కుమారులట. అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారింది. అందరి కళ్ళలో కన్నీళ్లే. స్వీపరుగా పని చేస్తూ కుమారులను చదివించానని, నాకష్టాన్ని పిల్లలు వృధా చేయలేదని, స్వీపరుగా నాఉద్యోగం ఆనందంగా నిర్వహించానని ఇంతకంటే నాకు మాటలు రావటం లేదంటూ, ఇక్కడి అఫిససుని, సిబ్బందిని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని కన్నీళ్ళు తుడుచుకుంటూ ప్రసంగాన్ని ముగించారు..

ఆమె పిల్లలు మాట్లాడుతూ ఏ రోజు తమ తల్లి తమని కష్టపడలేదు అని , చదువుకోండి అని మాత్రమే చెప్పింది. జీవితం లో చాల కష్టపడింది అని , చాల మంది చాల మాటలు అన్నారు అని , అవి ఏమి పట్టించుకోకుండా తను మనస్పూర్తిగా పని చేసింది అని ,  చదువులకి అయ్యే ఖర్చు మొత్తం ఏ రోజు ఎవరిని అడగకుండా , అప్పుచేయకుండా ఈ రోజు సమాజం లో మాకు తనకి మంచి పేరు తీసుకునివచ్చింది అని చెప్పాడు . ఆమె పిల్లలుగా మేము పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది అని చెప్పారు .

తమ పిల్లలు అంత మంచి పదవులు సాధించిన , సుమిత్ర దేవి ఇప్పుడు చేసే ఉద్యోగం మానేయలేదు , కారణం ఏంటి అంటే తన వృత్తికి తను ఇచ్చే గౌరవం మరియు ఆ ఉద్యోగం వల్లే తన పిల్లలని చదివించగలిగాను అని తను అంటున్నారు. పదవి విరమణ శుభాకాంక్షలు సుమిత్ర దేవి గారు , మీరు చాల మందికి స్పూర్తిదాయకం.

(బీహార్ లోని ఓప్రభుత్వ కార్యాలయంలో జరిగిన యదార్థ సంఘటన).

Reply