సుఖం కోసం మన దేశం లో కండోమ్ ల వాడకం తగ్గిపోయింది..!! సర్వే ఏం చెబుతుందంటే.?

కండోమ్ వాడకం మన దేశం లో గణనీయంగా తగ్గిపోయిందని ఇటీవల నిర్వహించిన ఒక సర్వే లో తేలింది, సుఖం కోసం కండోమ్ వాడకలను తగ్గించేశారని, దీని వలన HIV ఎయిడ్స్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు తెలియ చేసారు, ఇటీవల వారు నిర్వహించిన సర్వే లో 2011-12లో ప్రభుత్వం ఉచితంగా 59,61,251 కండోమ్‌లు సరఫరా చేయగా, 2016-17లో వాటి సంఖ్య 45,76,642కు తగ్గిపోయింది.

Health

అత్యధికంగా రాజస్థాన్‌లో 2011-12లో 10,84,700 కండోమ్‌లను వినియోగించగా, 2016-17లో ఆ సంఖ్య 6,50,542కు తగ్గింది. కాగా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం కండోమ్‌ల వినియోగం పెరగడం విశేషం. దాద్రా నగర్‌ హవేలీలో 2011-12లో 1,116 కండోమ్‌లు వినియోగించగా, 2016-17లో ఆ సంఖ్య 2,680కి పెరిగింది. ఈ సర్వే లో కేవలం గవర్నమెంట్ సరఫరా చేసిన కండోమ్ ల వివరాలు మాత్రమే సమాచార హక్కు చట్టం కింద తెలుపబడ్డాయి. అందరూ పిల్స్ వాడటానికి మొగ్గు చూపుతున్నారు, కండోమ్ ల వల్ల సరైన సుఖం పొందట్లేదు అని కండోమ్ ల వాడకం తగ్గించేశారు అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

అయితే కండోమ్ ల వాడకం భారతదేశం లో తగ్గాయి అనే మాటల్లో నిజం లేదని బెంగళూరుకు చెందిన ఓ హోటల్‌ మేనేజర్‌ సురేశ్‌ ఘోష్‌ అన్నారు. సురేశ్‌ ఘోష్‌ మాట్లాడుతూ : ” ఈ కాలం లో గవర్నమెంట్ కండోమ్ లు వాడే వారి సంఖ్యా చాలా తక్కువ అని, బయట మెడికల్ షాప్ లలో కొనేవారు, ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో కండోమ్స్ ఆర్డర్ చేసే వారి సంఖ్యా ఘననీయంగా పెరిగిందని” ఆయన తెలిపారు. సురేశ్‌ ఘోష్‌ చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది, ఇటీవల కాలం లో ఎక్కువ శాతం ఆన్ లైన్ లోనే కండోమ్స్ ని ఆర్డర్ చేస్తున్నారు, నేరుగా ఇంటికే వస్తుండటం తో, చాలా మంది ఆన్ లైన్ లో ఆర్డర్ చేయడానికే మొగ్గుచూపుతున్నారు, ఇక మెడికల్ షాప్స్ కూడా విస్తారంగా ఉండటం తో, ఇంటికి దేగ్గర్లో ఉండే మెడికల్ షాప్ కి వెళ్లి కావాల్సినన్ని తెచ్చుకుంటున్నారు.

 

Reply