సంబరాలు చేసుకుంటున్న విజయ్ మరియు అజిత్ ఫాన్స్ , కారణం ఇదే.!

దీపావళికి బరిలోకి దిగుతున్న సర్కార్ మూవీకి ‘యు/ఏ’ సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు వారు ఇచ్చారు . ఈ సినిమా తెలుగు , తమిళ్ బాషలలో విడుదల కానుంది.  దళపతి విజయ్ హీరోగ నటిస్తున్న చిత్రం ‘సర్కార్’ ,మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో మహానటి ఫేమ్ ‘కీర్తి సురేష్’ హీరోయిన్ గా నటించింది, ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె ‘వరలక్ష్మి శరత్ కుమార్’ ఈ చిత్రంలో  ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుంది అనేదాని పైన సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

VISWASAM SARKAR

విజయ్ గత చిత్రం ఐన ‘మెర్సల్’ ఘన విజయం సాధించి తమిళ్ ఇండస్ట్రీ రికార్డు లను తిరగరాసింది, దీపావళి కోసం విజయ్ అభిమానులు ఆసక్తిగ ఎదురు చూస్తుంటే, సంక్రాంతి కోసం అజిత్ అభిమనులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’ మూవీ సంక్రాంతి కి విడుదులవుతుందని ప్రకటించారు, దీపావళికే రిలీజ్ అవ్వాల్సిన చిత్రం అనివార్య కారణాల వల్ల సంక్రాంతి కి పోస్టుపోన్ అవ్వాల్సి వచ్చింది, ‘వీరం’ ‘వివేగం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ, విశ్వాసం మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు, నయనతార హీరోయిన్గ నటిస్తున్న ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఉన్నాయి.

విజయ్ మురగదాస్ కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన తుపాకీ మరియు కత్తి సినిమాలు ఘన విజయాలు సాధించాయి, సర్కార్ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 2.0 విడుదల అవుతుంది. తమ అభిమాన నటుడు సినిమా సెన్సార్ బోర్డు దెగ్గర ఏ ఇబ్బంది లేకుండా క్లియర్ అవ్వడం వల్ల విజయ్ అభిమానులు సంతోషం గా వున్నారు.అలాగే తమ అభిమాన నటుడు అజిత్ నటిస్తున్న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో అజిత్ అభిమానులు సంతోషంగా ఉన్నారు.

Reply