11 ఏళ్ళ పాప పంచ్ పవర్ చూస్తే ఆశ్చర్యపోతారు. బాక్సింగ్ జెమ్..!!

థాయ్‌లాండ్‌లో చైల్డ్ బాక్సింగ్‌కు చాలా ఆదరణ ఉంది, ఈ 11 ఏళ్ళ థాయిలాండ్ కు చెందిన అమ్మాయి పేరు మించాయా సిమ్‌వోంగ్, 8 ఏళ్ళ వయసునుండే ఈ అమ్మాయి బాక్సింగ్ మొదలెట్టింది, ఇప్పటివరకు 40 కి పైగా పోటీల్లో పాల్గొనింది. ఈమె ఆటతీరు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న వయసులో అంత పవర్ ఆ అని అవాక్కవుతున్నారు.

థాయ్‌లాండ్‌లో ఇంతే థాయ్‌లాండ్‌లో ఇంతే.. :

థాయ్‌లాండ్‌లో చైల్డ్ బాక్సింగ్‌కు విపరీతమైన ఆదరణ ఉంది, ఎంతలా అంటే అక్కడి చిన్న పిల్లలు వారి రోజు వారి దినచర్య ఆటగా బాక్సింగ్ నే ఆడటానికి ఇష్టపడేంత. వెనుకబడిన వర్గాలు, పెద్ద కుటుంబాలు ఈ బాక్సింగ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి, వారి కుటుంబ పోషణతో పాటు వారి చదువులకు సంబందించిన ఫీజు కూడా వారి సంపాదనతోనే కట్టుకుంటున్నారు.

మించాయా సిమ్‌వోంగ్ కూడా.. :

11 ఏళ్ళ అమ్మాయి మించాయా సిమ్‌వోంగ్ కూడా తనకు వచ్చే సంపాదనలో కొంత కుటుంబానికి ఇస్తుంది, మరికొంత తన చదువుల ఖర్చులకు ఉపయోగిస్తుంది. మించాయా సిమ్‌వోంగ్ మాట్లాడుతూ : “ఆటలో గెలిస్తే నగదు బహుమతులు వస్తాయి. అప్పుడప్పుడు కొందరు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంటారు. ఇప్పటి వరకు ఓసారి అత్యధికంగా రూ.10,000 సంపాదించాను” అని మించాయా సిమ్‌వోంగ్ వివరించారు.

ప్రాణానికి ప్రమాదకరమే :

చిన్న పిల్లోళ్ళు బాక్సింగ్ లో పాల్గొనడం అంటే వారి ప్రాణానికి ప్రమాదమే, చిన్న వయసులో గట్టి దెబ్బలు తగిలితే ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఇటీవలే థాయిలాండ్ లో బాక్సింగ్ లో పోటీపడుతూ 13 ఏళ్ళ బాలుడు మరణించాడు. బాలుడి మరణం తరువాత చాలా మంది చైల్డ్ బాక్సింగ్ ని నిషేధించాలని అన్నారు, కానీ ఈ ఆటకున్న ఆదరణ వల్ల ఇప్పట్లో సాధ్యం కాదనిపిస్తుంది. మించాయా సిమ్‌వోంగ్ కి కూడా ఒకసారి ఆటలో ప్రమాదం ఎదురయ్యింది. “ఓసారి బాక్సింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి నా కడుపులో పంచ్ ఇచ్చారు. దాంతో నాకు ఊపిరాడక కింద పడిపోయాను” అని చెప్పారు మించాయా సిమ్‌వోంగ్.

మన భారతదేశం లో కూడా చిన్నతనం నుండే బాక్సింగ్ ఆడే వాళ్ళు ఉన్నారు, కానీ చిన్న తనం నుండి బాక్సింగ్ ఆడే వారి సంఖ్య చాలా తక్కువ. అయితే పసితనం లోనే బాక్సింగ్ ను కెరీర్ గా ఎంచుకోడం సాహసం అని చెప్పాలి, 10 ఏళ్ళు కూడా నిండకుండా బాక్సింగ్ లో పాల్గొంటున్నారు థాయిలాండ్ లో, పిల్లోళ్లకు బాక్సింగ్ శిక్షణ ఇచ్చినా పర్లేదు, కానీ తోటి బాక్సర్ లతో పోటీ పాడేటప్పుడు జాగ్రత్తగా ఆడమని మాత్రం సలహాలు ఇవ్వాలి, బాక్సింగ్ లో చిన్న నిర్లక్ష్యం వలన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది కనుక.

Reply