పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలుసా..? మూడు కారణాలున్నాయి..! మీరనుకున్నది అయితే కాదు!

ఇద్దరు మనుషులను ఒకటిగా చేసే వేడుకే వివాహం… అప్పటివరకు వేరువేరుగా ఉన్న స్త్రీ పురుషులను దంపతులుగా కలిపడమే వివాహలక్ష్యం… కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు..మరికోందరు ఏ పరిచయం లేకపోయినా పెళ్లిచేసుకున్నాక వారి మధ్య ప్రేమ చిగురించేంతటి మహత్తు వివాహబంధానికి ఉంది… సహజీవనం,కాంట్రాక్ట్ మ్యారేజెస్ వచ్చి వివాహబందానికి బీటలు పడ్డాయని చెప్పొచ్చు.మారిన జీవనశైలి,ఉరుకుల పరుగుల జీవితంలో బంధాల కంటే ఎక్కువగా కెరీర్లో ఎదగడానికి ఫ్రిఫర్ చేయడం …పెళ్లెందుకు…అవసరమా అనే ఆలోచన ధోరణిలో నేటి యువత ఉంది…పెళ్లెందుకు అనే ప్రశ్నకి సమాధానం ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి.

ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు.1. ఋషిఋణం 2. దేవఋణం 3.పితౄ రుణం

ఈ మూడు ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి.వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది.

1. ఋషి ఋణం: బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేసి బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. పురాణాలను అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.

2. దేవఋణం:నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు.యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. . దీనివలన సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి.

3. పితౄ రుణం: తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి.సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! “ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః” అంటుంది వేదం. అంటే వంశపరంపరను త్రెంచవద్దు.

Reply