వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విడాకులు జారీ చేసిన జడ్జి..

వాట్సాప్ ద్వారా మెసేజ్ లు, కాల్ లు, వీడియో కాల్ లు చేసుకోవచ్చు, కానీ వాట్సాప్ ద్వారా విడాకులు కూడా తీసుకోవచ్చు అని మీకు తెలుసా, అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.? నాగపూర్ కి చెందిన ఒక జడ్జి ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమయ్యింది. వివరాల్లోకెళితే…

భార్య భర్తలు విడాకులు తీసుకోవాలి అంటే వారు కోర్ట్ లో హాజరయ్యి వారి వారి వాదనలు చెప్పుకోవాలి, ఇరువురి వాదనలు విన్నాక ఇరువురు అంగీకరిస్తే వారికి విడాకులు మంజూరు చేస్తారు, ఎందుకంటే జీవితకాలం కలిసుంటాం అని పెళ్లి చేసుకున్న వారిని విబేధాల వల్ల విడిపోతాం, కలిసుంటే బ్రతకలేము అని అంటే వారిని బలవంతంగా ఒక్కటి చేయలేము, కోర్ట్ విడాకులు ఇవ్వకూడదు అనే ప్రయత్నిస్తుంది, కానీ భార్య భర్తలు ఇద్దరు ఒకే తాటి పైన నిలబడి విడాకులు కావాల్సిందే అని అంటే అప్పుడు విడాకులు మంజూరు చేస్తుంది.

విడాకులు తీసుకోడానికి భార్య భర్తలు కోర్ట్ లో హాజరవ్వాలి కచ్చితంగా, కానీ నాగపూర్ కి చెందిన ఒక కోర్ట్ లో భర్త కోర్ట్ కి హాజరయ్యాడు, భార్య అమెరికా నుండి రాలేకపోయింది, దీంతో ఆమెతో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సంభాషణలు జరిపి, ఇరువురి అంగీకారం మేరకు వారికి విడాకులు జారీ చేసారు నాగపూర్ కోర్ట్ జడ్జి, ఈ విషయం అయి నాగపూర్ కోర్ట్ జడ్జి మాట్లాడుతూ : ” ఆమె అమెరికా లో ఉంది, ఆమెకు రాడానికి కుదర్లేదు అని వాట్సాప్ వీడియో కాల్ లోనే ఆమె వాదనలను విన్నాను, ఆమె డాక్యూమెంట్స్ అన్ని ప్రవేశపెట్టింది, వారిద్దరి కోరిక మేరకే వారికి విడాకులు మంజూరు చేశాను” అని నాగపూర్ కోర్ట్ జడ్జి తెలిపారు.

అంతే నాగపూర్ కోర్ట్ జడ్జి తీర్పు దేశం లో వైరల్ అయ్యింది, కొందరేమో అసలు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విడాకులు ఎలా మంజూరు చేస్తారు అని ప్రశ్నిస్తుంటే, మరికొందరేమో కలిసుండటానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వేరే ప్రత్యామ్న్యాయం లేక ఆ పని చేసినందుకు జడ్జి ని మెచ్చుకుంటున్నారు. అసలు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వాదనలు విని విడాకులు ఇవ్వడం మునుపెన్నడూ విని ఉండము.

ఇండియన్ ప్లీనల్ కోర్ట్ లో రానున్న రోజుల్లో మరెన్ని జడ్జిమెంట్ లను ఈ తరహా లో ఇస్తారో.? వేరే ప్రత్యామ్న్యాయం లేనప్పుడు కొత్త తరహా ఆలోచనలతో తీర్పులు ఇవ్వడంలో తప్పు లేదు, వాయిదాలు వేసే బదులు ఇలా కొత్త తరహా లో అలోచించి తీర్పు ఇవ్వడం మంచి పరిణామం అనే చెప్పొచ్చు.

Reply