‘నా కొడుకుని ఉరి తియ్యండి’ అంటున్న తల్లి, అనుమానం తో హత్య..

అనుమానం తో పెళ్ళాన్ని హత్య చేసాడు భర్త, మద్యంకు బానిస అయ్యి డబ్బు తీసుకొని ఉడాయించాడు, వివరాల్లోకెళితే, హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భారత్ నగర్ లో మద్యానికి బానిస అయి భార్య మీద అనుమానంతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. భగత్‌సింగ్‌నగర్‌లో నివసిస్తున్న రాము, శ్వేత దంపతులకు తొమ్మిదేండ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాము ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ రోజు ఆటో నడుపగా వచ్చిన డబ్బుతో మద్యం త్రాగి ఇంటికి వచ్చి శ్వేత ను చిత్రహింసలకు గురిచేసేవాడు.

భార్య శ్వేత పైన అనుమానం తో ఆమెను కొట్టే వాడు రోజు, భర్త ఎన్ని చేసినా పిల్లోళ్ల కోసం మౌనంగా భరించింది శ్వేత, సోమవారం నాడు మద్యం తాగి ఇంటికి వచ్చి శ్వేత తో కొట్లాట పెట్టుకున్నాడు రాము, ఆ కొట్లాటలో శ్వేత ను చంపేశాడు రాము, శ్వేత గొంతునులిమి చంపేశాడు, ఆ తరువాత ఇంట్లో నుండి పారిపోయాడు.

RS.15,000/- తో ఇంట్లో నుంచి పారిపోయాడు అని శ్వేత తండ్రి పోలీసులకి తెలిపారు, ఆ 15,000 రూపాయిలు శ్వేత చిన్న దుకాణం పెట్టుకోడానికి ఋణం గా తీసుకుందని, పిల్లోళ్ల బాగు కోసం తపించిన నా కూతురిని అన్యాయంగా చంపేశాడు అని శ్వేత తండ్రి నారాయణ రోధించారు.

నా కొడుకు కనిపిస్తే ఉరి తియ్యండి – రాము తల్లి :

బంగారం లాంటి కోడల్ని పొట్టన పెట్టుకున్నాడు అనుమానంతో, పిల్లోళ్లని ఆనాధలు చేసాడు, నా కొడుకు కనిపిస్తే ఉరి తియ్యండి సార్ అంటూ పోలీయులతో రోధిస్తూ చెప్పింది రాము తల్లి.

శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు సరూర్ నగర్ పోలీసులు. ఇలా భార్య మీద అనుమానం తో భార్యను చంపి పిల్లోళ్లని ఆనాధలు చేసి పారిపోతున్న మృగాలా సంఖ్య ఎక్కువైంది. ఇలాంటి సంఘటన ఈ వారం లోనే మార్కాపురం లో చోటు చేసుకుంది.

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కంభం రోడ్డులో శరభయ్య తన భార్య పార్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. పార్వతి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. శరభయ్య ముఠా కూలీగా పనిచేస్తున్నాడు. పార్వతిపై శరభయ్య అనుమానం పెంచుకొన్నాడు.ఈ విషయమై ప్రతి రోజూ భార్య, భర్తల మధ్య గొడవలు సాగుతుండేవి. శరభయ్య మద్యానికి బానిసయ్యాడు, ఈ కారణం చూపి ఇంకా ఎక్కువ తాగడం మొదలెట్టాడు. మద్యం తాగొచ్చి భార్యను వేధింపులకు గురి చేసేవాడు.

విషయం తెలుసుకున్న పార్వతి తల్లిదండ్రులు శరభయ్యకు నచ్చజెప్పారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు భార్య, భర్తల మధ్య మరోసారి గొడవ చోటు చేసుకొంది. ఈ గొడవ కారణంగా ఆగ్రహాంతో శరభయ్య భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు. శరభయ్య మీద పోలీసులకు ఫిర్యాదు చేసారు పార్వతి తల్లిదండ్రులు, ప్రస్తుతానికి శరభయ్య పరారీలో ఉన్నాడు.

Reply