పెళ్ళికి ముందు కూతురుకి తల్లి చెప్పవలసిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే..! ఎందుకో తెలుసా..?

ప్రేమ విఫలమైతే ఆత్మహత్య,చదువులో వెనకబడితే ఆత్మహత్య..ఎవరితో అన్నా గొడవైతే ఆత్మహత్య..ఇంట్లో వాళ్లు ఏమన్నా అంటే ఆత్మహత్య..ఇటీవలి కాలంలో ఇలాంటి వార్తలు చాలా చూసాం..అసలు మన పిల్లల జీవితాన్ని మనమెటు తీసుకుపోతున్నాం అనే ఆందోళన తల్లిదండ్రుల్ని పీడిస్తుంది.కానీ ఉరుకుల పరుగుల జీవితంతో అందరితో పోటీ పడుతూ,తాము పరుగెడుతూ తమ పిల్లల్ని కూడా పరిగెట్టిస్తున్నారు..ఒక పది నిమిషాలు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే తీరిక ఉండట్లేదు ఎవరీకీ..ఇంట్లో ఉండే కాసేపు సమయాన్ని కూడా ఫోన్,టీవి తీసుకుంటుంటే ఇక పిల్లల సమస్య పట్టించుకునేది ఎవరు? వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి సరైన గైడెన్స్ ఇచ్చేది ఎవరూ??తొమ్మిది నెలలు మోసి కన్న బిడ్డ తొమ్మిది నిమిషాలు సరైన ఆలోచన లేకుండా తన జీవితాన్ని బలి తీసుకుంటే కడుపుకోత ముఖ్యంగా తల్లికే..కే కాబట్టి ఎదిగిన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది..

స్వతంత్రత:

తమ పిల్లలు తమపై ఆధారపడాడాన్ని చాలా మంది తల్లిదండ్రులు ఇష్టపడుతుంటారు..కానీ పిల్లలకు స్వతంత్రంగా బతకడం నేర్పించాలి.వారి పనుల్ని వారు చేసుకునే విధంగా నేర్పిస్తే రేపు జీవితంలో ఏదన్నా సమస్య వచ్చినా వారే పరిష్కరించుకోగలుగుతారు.లేదంటే సమస్యే రాకుండా కూడా చూసుకోగలుగుతారు.

ఆత్మ గౌరవం:

నేటి పిల్లల్లో లోపస్తున్నది ఆత్మగౌరవం..తమని తాము ఇంకొకరితో పోల్చుకుంటూ వారికంటే మనం తక్కువగా ఉన్నాం అనే ఆత్మన్యూన్యతతో బాదపడుతున్నారుచాలామంది..తమకు తాముగా ఇలాంటి పోలిక కొందరు పెట్టుకుంటే ,స్వయంగా అమ్మా,నాన్నే తమ పిల్లలను మరొకరితో పోలుస్తూ కించపరుస్తుంటారు.ఇది సరైంది కాదు..పిల్లల్ని ఆత్మ గౌరవంతో పెరిగేలా తీర్చిదిద్దగలిగేది తల్లిదండ్రులే..అది వారి బాద్యత కూడా..

స్వీయ వ్యక్తీకరణ:

ఏ విషయాన్నైనా సూటిగా వ్యక్తీకరించేలా పిల్లల్ని ప్రోత్సహించాలి..చెప్పే విషయాన్ని కాన్ఫిడెంట్ గా చెప్పడం అనేది ఇంట్లో తల్లిదండ్రుల ముందు నుండే అలవడితే తర్వాతర్వాత అది వారికి ఉపయోగపడుతుంది.

కెరీర్ ప్రాధాన్యత:

ఆర్ధిక స్వేఛ్చ ఆడపిల్లకు చాలా అవసరం..కూతుర్ని పెళ్లి చేసి ఒక ఇంటికి పంపే దానికన్నా తను మంచి కెరీర్లో సెటిల్ అయ్యే విధంగా అమ్మాయిలకు చెప్పాలి.కెరీర్ ప్రాధాన్యత అందులో లోటు పాట్లు పిల్లలకు వివరించినట్టయితే వారి వారి కెరీర్ వారు డిజైన్ చేసుకోగలుగుతారు .లేదంటే మీ వంతుగా మీరు కూడా హెల్ప్ చేయవచ్చు. ప్రస్తుత ప్రపంచంలో ఆర్ధిక స్వతంత్రత అనేది ఎంత ముఖ్యమో వారికి తెలియచేయాలి..అది చక్కటి కెరీర్ తోనే సాధ్యమవుతుందని చెప్పాలి.

ఆత్మ రక్షణ:

ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలియని వాళ్లను ఎలా ఫేస్‌ చేయాలి, తనకు తాను రక్షణ ఎలా కల్పించుకోవాలి అనేవి చెప్పాలి..అబ్బాయిలతో ఎలా మసలుకోవాలి అనేది చెప్పాలి.అబ్బాయిలకు అమ్మాయిలతో ఎలా మెలగాలనేది చెప్పాలి..క్లిష్టపరిస్థితులనుండి బయటపడడమెలా అనేది చెప్పాలి.

Reply