నాన్ బాహుబలి2 రికార్డు సృష్టించిన F2, 50 కోట్ల మార్కు దాటిన F2.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం F2, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. విడుదల అయిన 9 రోజుల్లో 55 కోట్ల కు పైగా షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఆంధ్ర/ తెలంగాణ లో 45 కోట్ల వరకు షేర్ వసూలు చేసి రికార్డు కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది.

సెకండ్ వీకెండ్ మామూలు కుమ్ముడు కాదు :

F2 సెకండ్ వీకెండ్ లో భారీ మొత్తాన్ని కలెక్ట్ చేసింది, సెకండ్ వీకెండ్ లో దాదాపు 14 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వీకెండ్ ఈ సినిమా విధ్వంసం సృష్టించింది. బాహుబలి 2 తరువాత సెకండ్ వీకెండ్ లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా F2 రికార్డు నెలకొల్పింది. రంగస్థలం సెకండ్ వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని అధిగమించింది F2.

పండుగ చేసుకుంటున్న వెంకీ అభిమానులు :

విక్టరీ వెంకటేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు, వెంకీ సినిమా కి హిట్ టాక్ వస్తే కల్లెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడానికి ఈ సినిమానే ఒక ఉదాహరణ. ఫైనల్ రన్ లో 80 కోట్లకు పైగా షేర్ సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అంచనా.

ఆశ్చర్యం లో డిస్ట్రిబ్యూటర్స్ :

అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఆనందం లో మునిగితేలుతున్నారు, మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నైజాం లో 9 రోజులకి ఈ చిత్రం 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ట్రేడ్ పండితులని ఆశ్చర్య పరిచింది.

వెంకీ వరుణ్ కాంబో కేక :

వెంకటేష్ వరుణ్ తేజ్ లు తోడల్లుళ్లు ఈ సినిమా లో, అనిల్ రావిపూడి మరో సారి జనాల్ని మాయ చేసాడు, 1st హాఫ్ లో వెంకటేష్ సీన్స్ అయితే సూపర్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జనాలను ఆకట్టుకొనేలా ఈ చిత్రాన్ని అనిల్ మలిచిన తీరు అమోఘం. సుప్రీమ్, పటాస్, రాజా ది గ్రేట్ లో ఫైట్స్ అయినా ఉన్నాయ్, కానీ F2 మాత్రం మంచి క్లాస్ ఎంటర్టైనింగ్ మూవీ.

F2 – ఫన్ అండ్ ఫర్ ఫ్యామిలీ :

సంక్రాంతి సెలవులకు ఫ్యామిలీ మూవీస్ చూడాలని జనాలు అనుకుంటారు, ఈ పండక్కి వచ్చిన ఫ్యామిలీ మూవీ F2 మాత్రమే, దిల్ రాజు నమ్మకం ఒమ్ము కాలేదు. Mr.మజ్ను సినిమా వచ్చే వరకు F2 సినిమాకు ఢోకా ఉండదు. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ కు సంక్రాంతి కి ఈ సినిమా తో ఫుల్ మీల్స్ పెట్టాడు అనిల్ రావిపూడి, ఈ సినిమా కు సీక్వెల్ కూడా త్వరలోనే రానుందని అనిల్ రావిపూడి తెలిపారు.

Reply