ఇలాంటి కలెక్టర్లు కూడా ఉంటారా! అని మీరు కూడా ఆశ్చర్యపోతారు . అంత గొప్ప కలెక్టర్

ఇలాంటి కలెక్టర్లు కూడా ఉంటారా , అని మీరు కూడా ఆశ్చర్యపోవాలి. ఇంతటి గొప్ప మనసు, ఆడపిల్లలమీద ప్రేమ ఉన్న మనిషి ఆ వూరి కలెక్టరుగా రావడం వారి అదృష్టమనే చెప్పాలి., దయచేసి చదవండి , అభినందించండి.

Darez Ahamed (1)

ఇతని పేరు : దరేజ్ అహ్మద్ ,
ఎక్కడ పని చేస్తున్నారు : చెన్నై లోని పెరంబలూరు జిల్లా కలెక్టరు గారు
ఇటీవల ఇతను ‘ అద్బుతంగా ప్రజలను పరిపాలించినందుకు ప్రధాన మంత్రి అవార్డు అందుకున్నారు ( Prime Minister’s Award for Excellence in public administration ). మన ప్రధానమంత్రి చేతులమీదుగా తీసుకున్నారు.

గత 4 సంవత్సరాలుగా పెరంబలూరు జిల్లా కలెక్టరు పనిచేస్తున్నారు .

Darez Ahamed (2)

ఇతని గొప్పతనం ఏంటో తెలుసా! 450 దాకా బాల్య వివాహాలను ఆపేసిన ఘనత వీరిదే.

కలెక్టరును అన్న పొగరులేకుండా సామాన్యమైన మనిషిలా అందరితో కలసి మెలసి పనులను చేస్తుంటారు. ఈ ఫోటోలను గమనించండి. ఎంతబాగా తనుకూడా కలసి పనిచేస్తున్నారో చూడండి. బాల్య వివాహాలను ఆపడమేకాకుండా వారి ఉన్నత చదువులకు కావలసిన ఆర్థిక సహాయాన్ని బ్యాంకులద్వారా ఇప్పిస్తూ దగ్గరుండి సహాయపడుతున్నారు,

‘Super 30’, అన్న ఒక ప్రోగ్రామును పెట్టి ఆయా స్కూల్స్ లో బాగా చదివే విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి మెరుగైన జీవితాన్ని,వారి జీవితంలో కాంతిని నింపాలన్న నిశ్చయంతో ఉన్నారు.

అంతే కాదు, ప్రత్తి రైతులకు మంచి ధరను ఇవ్వడంలో తనవంతు కృషిని చేశారు.అంగనువాడి ఉద్యోగులకు,నర్సులకు ఖచ్చితమైన సూచనలను చేసి వారి దృష్టిలోకి వచ్చిన ఏ బాల్యవివాహాల గురించి ఎప్పటికప్పుడు తనకు సమాచారాన్ని అందించేలా ఉత్తర్వులను జారీ చేసారు.

Darez Ahamed (3)

మామూలుగా స్కూల్స్ కు ఇంస్పెక్షను కు వస్తున్నారు అంటే భయపడుతూ ఉంటారు కదా! కానీ ఈ కలెక్టరుగారు తరచుగా వారి స్కూల్స్ కు రావడం చాలా సంతోషంగా భావిస్తారు ఇక్కడి ఉపాధ్యాయులు.

ఈ విషయాన్ని టైప్ చేస్తుంటేనే నాకు చాల సంతోషంగా ఉంది. మరి అలాంటి కలెక్టరును పొందిన వారు ఎంతటి అదృష్టవంతులో కదా. మనకు కూడా ఇలాంటి కలెక్టర్లు రావాలని మనస్పూర్థిగా కోరుకుంటూ. ఈ మహానుభావునికి శిరస్సువంచి నమస్కరిద్దాం రండి. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్.

Reply