ఎన్నికల్లో ఓటు వేసాక సెల్ఫీ దిగితే మీ ఓటు చెల్లదు. అసలు ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.?

సెల్ఫీ లు అంటే చాలా మందికి మోజు, ఒకప్పుడు ప్రమాదాలు జరిగితే సహాయ సిబ్బందికి కాల్ చేసేవారు, ఇప్పుడు ఆ ప్రమాదాల ముందు నిలబడి సెల్ఫీ లు దిగే వారు, వీడియో లు తీసే వారి సంఖ్యా ఘననీయంగా పెరిగింది. అయితే మీరు ఎన్నికల బూతులో ఓటు వేసిన వెంటనే, మీ అత్యుత్సాహం తో సెల్ఫీ దిగి, నేను ఓటు వేసాను అని సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటే మీ ఓటు రద్దు చేయబడుతుంది.

ఎన్నికల బూతు లో ఫోన్ లు అనుమతించబడవు, ఒకవేళ మీరు ఫోన్ తీసుకొని వెళ్లి ఓటు వేసాక ఎన్నికల బూతులో సెల్ఫీ దిగితే, మీ ఓటు ని రద్దు చేస్తారు, మీరు ఓటువేస్తూ సెల్ఫీ దిగితే ఆ ఓటును 17 ఏలో నమోదు చేస్తారు. ఎప్పుడైతే ఆ ఓటును 17-ఏలో నమోదు చేశారో అది కౌంటింగ్ సమయంలో పరిగణలోకి తీసుకురాదు. దాన్ని కౌంట్ చెయ్యరు.

సెల్ఫీ లు ఎక్కడ దిగాలి?

ఇంటికి వెళ్ళాకనో, లేదా ఎన్నికల కేంద్రం కి కొంచెం దూరం వెళ్ళాకనో మీకు నచ్చిన భంగిమలలో మీరు సెల్ఫీ లు దిగి ఎక్కడైనా అప్లోడ్ చేసుకోండి.

ఎన్నికల సమయం లో ఇవి చేస్తే జైలు పాలే..!!

దొంగ ఓటు వేసిన వాళ్ళకి 6-7 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది, కనుక దొంగ ఓట్లు వెయ్యకండి. ఎన్నికల కేంద్రం లో మీరు ఓటు ఎవరికి వేస్తున్నారో, లేక వేరే వాళ్ళని వీరికి ఓటు వేయండి అని చెప్పినచో మీ ఓటు చెల్లదు, అది నేరం కిందకు వస్తుంది. కనుక, వెళ్ళామా… ఓటు వేశామా.. అన్నట్టు ఉండాలి. బయటికి వచ్చాక మీ ఇష్టం.

ఇకపోతే డిసెంబర్ 7 వ తారీఖున తెలంగాణ లో ఎన్నికలు జరగనున్నాయి, డిసెంబర్ 11వ తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి, ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉంది కాబట్టి, సెల్ఫీ లు దిగేటప్పుడు జాగ్రత్త వహించండి, లేదంటి మీకు ఇష్టమైన పార్టీ/నాయకుడికి మీరు వేసిన ఓటు పనికి రాకుండా పోతాది.

 

Reply