లేటు వయసులో ఘాటు ప్రేమ..భర్తను దారుణంగా చంపేసిన భార్య..!

ప్రేమ గుడ్డిదని అంటారు, కానీ కట్టుకున్న మొగుడిని చంపి పిల్ల వాడిని వదిలేసేంత గుడ్డిదని అనుకోలేదు. చిత్తూరు జిల్లాలో హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బక్కేమారునాయక్‌ను భార్యే హత్య చేసిందని పోలీసుల దర్యాప్తులో తేల్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలోనే రేణుమాకులపల్లె పంచాయతీ జోగివానిబురుజు కల్వర్టు వద్ద నవంబర్ నాలుగో తేదీన బక్కేమారునాయక్ హత్యకు గురయ్యాడు. ఈ ఏడాది మే 29వ తేదీ నుండి బుక్కేమారు నాయక్ తప్పిపోయాడు. ఈ విషయమై బుక్కేమారునాయక్ తనయుడు హరినాయక్ ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో బుక్కేమారునాయక్ భార్య రమణమ్మే అతడిని హత్య చేసిందని పోలీసులు తేల్చారు. బల్లాపురంపల్లెకు చెందిన మదన్‌మోహన్ రెడ్డితో పెట్టుకున్న వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని తేలింది. విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ఈ సంవత్సరం మే 26న కోటకొండ ఎగువ తండాలో జాతర సందర్భంగా మారునాయక్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య భర్తను చంపాలని ప్లాన్ వేసింది. ఇంట్లో ఉన్న మందు గోళీలను దంచి మద్యంలో కలిపి ఇచ్చింది. దీంతో మారునాయక్ వాంతులతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తన ప్రియుడు మదన్‌మోహన్‌రెడ్డికి రమణమ్మ ఫోన్ చేసింది. మదన్ మోహన్ రెడ్డి మారునాయక్ మృతదేహన్ని సంచిలో మూటకట్టి ట్రాక్టర్‌లో జోగివానిబురుజు వద్ద కల్వర్టు వద్దకు తీసుకెళ్లి పూడ్చివేశాడు. మదన్ మోహన్ రెడ్డికి మరో ముగ్గురు స్నేహితులు సహకరించారని పోలీసులు తేల్చారు.

  • విడాకులు అనే ఒక ఆప్షన్ ఉంటది కదండీ, అవేవో తీసుకొని ఆ మనిషిని ప్రాణాలతో వదిలేయొచ్చు కదా, ప్రపంచం లో ప్రతి వాడు హంతకుడి లాగా అలోచించి మర్డర్ చేసేయడమే, తగలపెట్టండి సార్ ముందు ఇలాంటి ఆలోచనలని….
  • మీ అయన చస్తే మీరు మీ ప్రియుడితో ఉండగలుగుతారు, చంపితే జైలు లో ఉంటారు…ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అమ్మ మీరు

ఎనీ హౌ,, అల్ ది బెస్ట్..జైలు లో ఉన్నంత కాలం అయినా ఎవరిని హత్య చేయకుండా, ఇంకెవరినైనా హత్య చేయాలి అని ఆలోచించకుండా ఉంటారని ,, మీ కొడుకు వల్లే మీరు దొరికి పోయారు అని మీ కొడుకు మీద కక్ష కట్టకుండా తనను వదిలేస్తారని ఆశిస్తున్నా..

Reply