అది చూస్తూ ఎవరైనా చనిపోయారా.? పోర్న్ చూస్తే తప్పేంటి – రామ్ గోపాల్ వర్మ!!

వివాదాల ధీరుడు, ట్విట్టర్ వీరుడు అయిన వర్మ, మరో సారి సంచలన కామెంట్స్ చేసారు, GST సినిమా తో హంగామా సృష్టించాడు వర్మ, ఫేమస్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో నగ్నంగా హైదరాబాద్ లోనే సినిమా అంత తీసి, ఏమి తెలియని నంగనాచి లాగ అందరిని ఒక ఆట ఆడుకున్నాడు వర్మ. వర్మ కు సన్నీ లియోన్ అంటే చాలా ఇష్టం. తన ఆరాధ్య దైవం సన్నీ లియోన్ అని వర్మ పలు సార్లు చెప్పాడు.

పోర్న్ పైన మీ అభిప్రాయం ఏంటి.?

పోర్న్ పైన మీ అభిప్రాయం ఏంటి అని వర్మ ను అడిగిన ప్రశ్నకు వర్మ బదులిస్తూ, “నా దృష్టిలో పోర్న్ చూడడం, యాక్షన్ సినిమా చూడడం రెండూ ఒక్కటే. రెండు చోట్లా ఫాంటసీ మాత్రమే ఉంటుంది. ఓ వ్యక్తి మద్యం తాగితే చనిపోతాడు. పొగ తాగితే చనిపోతాడు. కానీ సెక్స్ చేస్తూ చనిపోవడం లేదా పోర్న్ చూస్తూ చనిపోడం చూసారా.? పోర్న్ చూడటం తప్పు, పాల్గొనటం అనైతికం అని మన పైన బలవంతంగా రుద్దుతున్నారు. సినిమాలు చూస్తే పాడైపోతారు అనేది ఎంత అబద్దమో, పోర్న్ చూస్తే పాడైపోతారు అనేది కూడా అంతే అబద్ధం”, అని వర్మ తెలిపారు.

శృంగారాన్ని చట్టబద్ధం చేసిన దేశాల్లో .

“శృంగారాన్ని చట్టబద్ధం చేసిన దేశాల్లో నేరాల శాతం చాలా తక్కువ అని ఒక అధ్యానం లో తేలింది. గొంతు అమ్ముకొని (పాటలు పాడి) డబ్బులు సంపాదించుకున్నప్పుడు తప్పు లేనిది, శరీరాన్ని అమ్ముకుంటే వ్యభిచారం ఎలా అవుతుంది అని దాసరి నారాయణరావు గారు తీసిన ‘కల్యాణి’ సినిమా లో ఒక డైలాగ్ ఉంది, కళ్యాణి సినిమాని చాలా సార్లు చూసాను. కళ్యాణి సినిమా అంటే నాకు చాలా ఇష్టం” అని వర్మ తెలిపారు.

పోర్న్ గురించే కాదు, ఏ విషయం గురించి అయినా ధైర్యంగా ఏ సమయం లో అయినా అందరి ముందు మాట్లాడగలిగే స్వభావం ప్రస్తుతమున్న సినిమా ఇండస్ట్రీ లో కేవలం ఒక్క వర్మ కె ఉంది, టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరిని ఒక ఆటాడుకుంటాడు వర్మ, తాజాగా పోర్న్ గురుంచి వర్మ చేసిన కామెంట్స్ పైన నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

Reply