హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా.?

హీరో విశాల్ కు తమిళ్ నాడు లో ఎంత క్రేజ్ ఉందో, ఆంధ్ర తెలంగాణ లో కూడా అంతే క్రేజ్ ఉంది. కేవలం తెలుగు వాడనే కాదు, విశాల్ నటన, చేసే సినిమాలు చూసి మన జనాలు విశాల్ ని అభిమానించడం మొదలెట్టారు. పందెం కోడి నుండి పందెం కోడి 2 వరకు విశాల్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగు లో డబ్ అయ్యాయి. గత ఏడాది వచ్చిన అభిమన్యుడు చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు విశాల్.

పెళ్లి పీటలెక్కబోతున్న విశాల్, 

త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నడు విశాల్, ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించాడు విశాల్. ఇన్ని రోజులు విశాల్ మీద వస్తున్న పుకార్లకు విశాల్ చెక్ పెట్టినట్టు అయ్యింది, విశాల్ పెళ్లి చేసుకోబోతుంది తెలుగమ్మాయి నే.

పెళ్లి చూపులు… :

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో నటించిన అనిషా ఆళ్ల రెడ్డి ని పెళ్లి చేసుకోబోతున్నాడు విశాల్, మార్చ్ లో లేదా ఏప్రిల్ లో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారు, నడిగర్ సంఘం భవనం పూర్తి అయ్యాక వివాహం చేసుకుంటా అని విశాల్ తెలిపాడు, ఆ భావన నిర్మాణం పూర్తి కావొచ్చింది, జులై లో లేదా ఆగష్టు లో విశాల్ పెళ్లి జరగొచ్చు. అవును నేను పెండ్లి చేసుకోబోతున్న, చాలా సంతోషంగా ఉన్నా, అమ్మాయి పేరు అనీషా, త్వరలోనే వివాహ తేదీలను తెలియజేస్తానన్నారు విశాల్. విశాల్ పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాక, సోషల్ మీడియా లో శుభాకాంక్షలతో విశాల్ ని ముంచెత్తారు, తెలుగు తమిళ్ ఇండస్ట్రీ వర్గాలు విశాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ట్రోల్ల్స్ ట్రోల్ల్స్… :

విశాల్ పెళ్లి చేసుకోబోతున్న అనిషా ఆళ్ల రెడ్డి పైన కొందరు నెటిజన్స్ ట్రోల్ల్స్ వేస్తున్నారు, ఆమెను అసభ్య పద జాలం తో కొందరు దూషించారు. డబ్బు ఆశ చూపి పెళ్లి చేసుకుంటున్నావ్, నువ్వు తనకి కరెక్ట్ కాదు, విశాల్ ను పెళ్లిచేసుకోవద్దు అది ఇది అని ఆమెను దూషిస్తున్నారు. వారికి ధీటుగా సమాధానం ఇచ్చింది ఆమె, నేను విశాల్ ని డబ్బు కోసం ప్రేమించలేదు, డబ్బుబ్ కోసం ప్రేమించేలా చెయ్యలేదు, తనది అలంటి క్యారెక్టర్ కాదు, మా జంట బాలేదా.? అయితే ఓకే. అనిషా ఆళ్ల రెడ్డి కి చాలా మంది నెటిజన్స్ సపోర్ట్ చేసారు, ఆమెను ట్రోల్ చేసిన వారిని ట్రోల్ చేసారు కొందరు నెటిజన్స్. పెళ్లి చేసుకుంటున్న విశాల్ కు లేని బాధ నీకెందుకు అంటూ ఇలాంటి దిమ్మ తిరిగే రెప్లైస్ తో ట్రోల్లర్స్ ని ట్రోల్ చేసారు.

 

Reply