వ్యసనాల మోజు లో పడి కుటుంబ పతనానికి కారణం అయిన వ్యక్తి.?

అమ్మ నాన్న తమ్ముడు, వీళ్ళే తన ప్రపంచం అని అనుకుంది ఒక అమ్మాయి, డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఒక వ్యక్తిని ప్రేమించింది, రెండు ఇళ్లలోనూ చదువు అయ్యాక పెళ్లి చేస్తాం అని చెప్పారు, ఒక నాడు కడుపు నొప్పి విపరీతంగా రావడం తో ఆ అమ్మాయి తల్లితో కలిసి హాస్పిటల్ కి వెళ్ళింది, స్కానింగ్ చేసిన డాక్టర్స్, అమ్మాయి గర్భవతి అని చెప్పారు, డాక్టర్ ల ముందే అమ్మ, అమ్మాయిని కొట్టింది.

అమ్మాయి వాళ్ళ నాన్న తమ్ముడు హాస్పిటల్ కి చేరుకున్నారు, నాన్న కూడా అమ్మాయి ని కొట్టాడు, పెళ్లి చేస్తాం అన్న వినకుండా ఇలాంటి పని ఎందుకు చేసావ్ అంటే.. చేసింది అతను కాదు, అతనితో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు అని అమ్మాయి వాపోయింది, ఒక్క సారిగా ఏం జరిగిందో గుర్తు తెచ్చుకున్న ఆమె, వెళ్లి లారీ కింద పడింది, హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన ప్రాణాలు నిలువ లేదు. అసలు ఆ అమ్మాయి కడుపు కి కారణం తమ్ముడే అని తెలుసుకున్నాడు నాన్న, కొడుకుని పోలీస్ లకి అప్పగించి అమ్మ నాన్న లు ఇద్దరు పురుగుల మందు తాగి చనిపోయారు, రాత్రి పూట్ల అక్కకు మత్తు మందు ఇచ్చి, లైంగికంగా వేదించే వాడు తమ్ముడు, చేదు అలవాట్లకు బానిస ఐన అతగాడి వల్ల కుటుంబం మొత్తం నాశనమైంది. అమ్మ నానా అక్క అందరు చనిపోగా, తాను చేసిన తప్పుకి కటకటాల పాలయ్యాడు, ఈ ఘోరమైన సంఘటన తెలుసుకున్న బంధువులు, ఇంటి దెగ్గర ఉండే వ్యక్తులు శోక సంద్రంలో మునిగిపోయారు.

స్వేచ్ఛ ఇవ్వడం లో తప్పు లేదు, కానీ మితి మీరిన స్వేచ్ఛ ఎప్పటికైనా ప్రమాదానికి కారణం అవుతుంది, రాత్రి 2,3 వరకు స్మార్ట్ ఫోన్ లో ఎవరెవరితోనో చాట్ చేసుకుంటా, దానికి బానిసలు అయిపోయారు యువత, పెద్ద వాళ్ళు కూడా పిల్ల వాళ్ళతో చేరి రాత్రి పగలు అని తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ లు వినియోగిస్తూ, వాళ్ళకి ఇంకా వత్తాసు పలుకుతున్నారు . వ్యసనాలు అనేవి మితి మించకూడదు, సిగరెట్ మందు అమితంగా తీసుకున్న మన ప్రాణానికే కాకుండా ఇతరుల ప్రాణానికి కూడా ఎక్కువ శాతం నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి, కనుక జీవితం లో జాగ్రత్తగా ఉండండి.

 

Reply