Header Ads

Mr.మజ్ను చిత్రం సెన్సార్ టాక్. మొదటి కమర్షియల్ హిట్ కొట్టబోతున్న అఖిల్.?

అఖిల్ అక్కినేని. అక్కినేని ఫ్యాన్స్ కి అఖిల్ అంటే ఎందుకో విపరీతమైన అభిమానం, అఖిల్ మొదటి చిత్రం అయిన అఖిల్ సినిమాకు ఫ్యాన్స్ మాములు హంగామా చెయ్యలేదు, అక్కినేని హీరోలలో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా అఖిల్ సినిమా రికార్డుల్లో నిలిచిపోయింది, అఖిల్ సినిమా తరువాత అక్కినేని హీరో ల చిత్రాలు చాలానే వచ్చాయి, కానీ ఏ ఒక్క సినిమా అఖిల్ మొదటి రోజు కలెక్షన్స్ ని దాటలేకపోయింది.



హలో హలో..:

ఇక అఖిల్ రెండో చిత్రం అయినా హలో సినిమా క్లాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది, అప్పుడు మంచి ఫార్మ్ లో ఉన్న నాని తో కాంపిటీషన్ లో రిలీజ్ చేసాడు నాగార్జున, నాని ఎమ్.సి.ఏ చిత్రం తో పాటు హలో సినిమా కూడా విడుదలయ్యింది. అయితే ఎమ్.సి.ఏ చిత్రం కమర్షియల్ చిత్రం కావడం తో ఆ చిత్రానికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి, ఓవర్సీస్ విషయానికి వచ్చే సరికి హలో చిత్రం తో 1 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసి నాగచైతన్య కంటే ముందే 1 మిలియన్ డాలర్ మార్క్ సాధించాడు అమెరికా లో. కాంపిటీషన్ లో కాకుండా మాములుగా వచ్చి ఉంటే హలో చిత్రం ఇంకా చాలా మందికి రీచ్ అయి ఉండేది.

జాగ్రత్త పడ్డాడు అండోయ్.. :

అందుకే ఈ సారి అఖిల్ జాగ్రత్త పడ్డాడు, సంక్రాంతి కి విడుదల చేసే అవకాశమున్నా, రిపబ్లిక్ డే స్పెషల్ గా Mr.మజ్ను సినిమాని విడుదల చేస్తున్నాడు, జనవరి 25 న Mr.మజ్ను సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ సినిమా థియేటర్ హక్కుల్ని కూడా ప్రపంచవ్యాప్తంగా 21 కోట్లకు అమ్మారని సమాచారం. హాలిడే సీజన్లో, అందులోనూ F2 సినిమా తప్పితే మారే చిత్రం మార్కెట్ లో హంగామా చెయ్యట్లేదు. దీంతో కొంచం పాజిటివ్ టాక్ వచ్చినా అఖిల్ కి మొదటి భారీ కమర్షియల్ సక్సెస్ రావడం కంఫర్మ్.

సెన్సార్ టాక్ అదరహో :

Mr.మజ్ను సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ లభించింది, ఎటువంటి కట్స్ లేకుండా సినిమాకి సర్టిఫికెట్ జారీ చేసారు, కేవలం రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ఉండటం తో యు/ఏ వచ్చిందని సెన్సార్ సభ్యులు తెలిపారు, సెన్సార్ ఇన్సైడ్ టాక్ ప్రకారం Mr.మజ్ను ఫస్ట్ హాఫ్ మరియు క్లైమాక్స్ మూవీ లో పాసిటివ్స్ అని సమాచారం, ముఖ్యంగా చివరి 15 నిమిషాలే సినిమాకి ప్రాణం అట. తొలిప్రేమ చిత్రం తరువాత వెంకీ అట్లూరి మరోసారి మాయ చేయనున్నాడన్నమాట.

ఆరేంజ్ ఆ :

అయితే ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్ర ట్రైలర్ ని జూ.ఎన్టీఆర్ లాంచ్ చేసారు, ఈ ట్రైలర్ చుసిన అందరూ ఆరేంజ్ సినిమా పోలికలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అని పేర్కొంటున్నారు. అయితే సినిమా రిసల్ట్ మాత్రం ఆరేంజ్ సినిమా తరహా లో ఉండకూడదు అని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.

https://www.youtube.com/watch?v=XSnFa0zqXRM

No comments