Header Ads

ఈ కుమ్ముడేంటండీ బాబు.. కొన్ని ఏరియాస్ లో రంగస్థలం ని దాటేసిన F2..!!

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం F2. అనిల్ రావిపూడి F2 చిత్రానికి దర్శకత్వం వహించాడు, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పైన F2 చిత్రాన్ని నిర్మించాడు దిల్ రాజు. ఈ సినిమాలో వెంకటేష్ కు తమన్నా జోడీగా, వరుణ్ తేజ్ కు మెహ్రీన్ జోడీగా నటించారు. ఈ చిత్రం విడుదల అయి వారం రోజులైంది, సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.





ఈస్ట్ గోదావరి లో మాములు కుమ్ముడు కాదు.. :

ఈస్ట్ గోదావరి లో పెద్ద హీరోల చిత్రాల మొదటి వారం గ్రాస్ ని సైతం అధిగమించింది ఈ చిత్రం. చాలా ఏరియాస్ లలో మొదటి వారం బాహుబలి 2 చిత్రం తరువాత ఎక్కువ షేర్ రాబట్టిన చిత్రంగా రికార్డు లకి ఎక్కింది. పండక్కి ఫామిలీ సినిమా క్లిక్ అయితే ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి అనడానికి F2 ఒక ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రైట్స్ 32 కోట్లకు అమ్ముడుపోయాయి, కానీ విడుదల అయిన వారం లోనే కేవలం ఆంధ్ర తెలంగాణ లోనే 38 కోట్ల వరకు షేర్ ను రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి వారం లో 45 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.

ఆశ్చర్యం లో డిస్ట్రిబ్యూటర్స్ :

అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఆనందం లో మునిగితేలుతున్నారు, మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నైజాం లో కూడా మొదటి వారమే ఈ చిత్రం 12 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ట్రేడ్ పండితులని ఆశ్చర్య పరిచింది.

వెంకీ వరుణ్ కాంబో కేక :

వెంకటేష్ వరుణ్ తేజ్ లు తోడల్లుళ్లు ఈ సినిమా లో, అనిల్ రావిపూడి మరో సారి జనాల్ని మాయ చేసాడు, 1st హాఫ్ లో వెంకటేష్ సీన్స్ అయితే సూపర్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జనాలను ఆకట్టుకొనేలా ఈ చిత్రాన్ని అనిల్ మలిచిన తీరు అమోఘం. సుప్రీమ్, పటాస్, రాజా ది గ్రేట్ లో ఫైట్స్ అయినా ఉన్నాయ్, కానీ F2 మాత్రం మంచి క్లాస్ ఎంటర్టైనింగ్ మూవీ.

F2 – ఫన్ అండ్ ఫర్ ఫ్యామిలీ :

సంక్రాంతి సెలవులకు ఫ్యామిలీ మూవీస్ చూడాలని జనాలు అనుకుంటారు, ఈ పండక్కి వచ్చిన ఫ్యామిలీ మూవీ F2 మాత్రమే, దిల్ రాజు నమ్మకం ఒమ్ము కాలేదు. Mr.మజ్ను సినిమా వచ్చే వరకు F2 సినిమాకు ఢోకా ఉండదు. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ కు సంక్రాంతి కి ఈ సినిమా తో ఫుల్ మీల్స్ పెట్టాడు అనిల్ రావిపూడి, ఈ సినిమా కు సీక్వెల్ కూడా త్వరలోనే రానుందని అనిల్ రావిపూడి తెలిపారు.

No comments