Header Ads

సంచలనం సృష్టిస్తున్న F2, రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది..!!

సంక్రాంతి కానుకగా వచ్చిన F2 సినిమా, కొత్త రికార్డులను సృష్టిస్తుంది. 4 వ రోజు మరియు 5 వ రోజు చాలా చోట్ల బాహుబలి 2 చిత్రం తరువాత ఎక్కువ షేర్ సాధించిన చిత్రం గా రికార్డ్స్ సృష్టించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన F2 చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు, వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.





వెంకీ తమన్నా... :

విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తరువాత పూర్తి వినోదాత్మక చిత్రం లో నటించారు, ఆయన కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాల తరువాత ఆ రేంజ్ లో జనాలను ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన వెంకీ చిత్రం ఇదే, ఇక తమన్నా, వెంకటేష్ మధ్య సీన్స్ కానీ తమన్నా ఫ్యామిలీ వెంకటేష్ మధ్య సీన్స్ కానీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయి.

హనీ ఇస్ ది బెస్ట్ :

సినిమా నుండి బయటకు వచ్చాక అందరికి మెహ్రీన్ క్యారెక్టర్ గుర్తుండిపోతాది, మెహ్రీన్ బాధలు తట్టుకోలేక ఇబ్బంది పడే బాయ్ ఫ్రెండ్ పాత్రలో వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా లో వరుణ్ తేజ్, వెంకటేష్ మధ్య వచ్చే సీన్స్ కానీ వాళ్లిద్దరు కలిసి చేసిన సీన్స్ కానీ జనాల్ని ఆకట్టుకుంటాయి. కోబ్రా అంటూ వరుణ్ తేజ్ మరో పదాన్ని జనాలకు అలవాటు చేసాడు.

వెంకీ వరుణ్ కాంబో కేక :

వెంకటేష్ వరుణ్ తేజ్ లు తోడల్లుళ్లు ఈ సినిమా లో, అనిల్ రావిపూడి మరో సారి జనాల్ని మాయ చేసాడు, 1st హాఫ్ లో వెంకటేష్ సీన్స్ అయితే సూపర్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జనాలను ఆకట్టుకొనేలా ఈ చిత్రాన్ని అనిల్ మలిచిన తీరు అమోఘం. సుప్రీమ్, పటాస్, రాజా ది గ్రేట్ లో ఫైట్స్ అయినా ఉన్నాయ్, కానీ F2 మాత్రం మంచి క్లాస్ ఎంటర్టైనింగ్ మూవీ.

F2 - ఫన్ అండ్ ఫర్ ఫ్యామిలీ :

సంక్రాంతి సెలవులకు ఫ్యామిలీ మూవీస్ చూడాలని జనాలు అనుకుంటారు, ఈ పండక్కి వచ్చిన ఫ్యామిలీ మూవీ F2 మాత్రమే, దిల్ రాజు నమ్మకం ఒమ్ము కాలేదు, విడుదల అయిన 5 రోజులకి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ట్రేడ్ పండిడితులను సైతం ఆశ్చర్యపరిచింది. Mr.మజ్ను సినిమా వచ్చే వరకు F2 సినిమాకు ఢోకా ఉండదు. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ కు సంక్రాంతి కి ఈ సినిమా తో ఫుల్ మీల్స్ పెట్టాడు అనిల్ రావిపూడి, ఈ సినిమా కు సీక్వెల్ కూడా త్వరలోనే రానుందని అనిల్ రావిపూడి తెలిపారు.

No comments