Header Ads

ఎక్కడున్నా వచ్చేయి సోదరా - పాయల్ రాజ్‌పుత్!!

'RX-100' చిత్రం తో కుర్రకారులని ఒక ఊపు ఊపింది పాయల్ రాజ్‌పుత్, అదే సినిమాలోని 'పిల్లా రా' సాంగ్ అయితే ఇప్పటికీ జనాల మదిలో మెదులుతూనే ఉంది, 'RX-100' చిత్రం తో ఒక్క సారిగా సెన్సేషన్ సృష్టించిన ఈ ముంబై భామ జీవితం లో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయ్, సోదరుడి కోసం ఎంతగానో తపిస్తూ బాధపడుతుంది పాయల్ రాజ్‌పుత్. వివరాల్లోకెళితే,,




మూడేళ్ళ క్రితం ఇంటిని వదిలి వెళ్లిపోయాడు పాయల్ రాజ్‌పుత్ సోదరుడు ధృవ్. 25 సంవత్సరాల వయసున్న ఇతను 27 మార్చి 2016 నుంచి కనిపించటం లేదు. ఇదే అంశంపై పాయల్ ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేసింది. తన సోదరుడి ఆచూకీ కోసం ముంబై పోలుసులకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు.

ట్విట్టర్ లో బాధ పడుతూ:

ఎంతో ఆవేదనతో ట్విట్టర్ లో ట్వీట్ వేసింది పాయల్ రాజ్‌పుత్. తన సోదరుడి కోసం ఎంత తపిస్తుందో ఈ ట్వీట్ చూస్తేనే అర్ధం అవుతాది, పాయల్ రాజ్‌పుత్ చేసిన ట్వీట్ : " నా సోదరుడు 3 ఏళ్ళు అవుతుంది మమ్మల్ని విడిచిపెట్టి, నువ్వు వెళ్ళిపోయి 3 ఏళ్ళు అవుతుంది, పుట్టిన రోజు శుభాకాంక్షలు సోదరా, నీకు ఈ మెసేజ్ అందుతుందని నా ఆకాంక్ష, ఒకవేళ నువ్వు ఎక్కడైన ఇరుక్కొని ఉంటె మాకు కాల్ చెయ్, ఒక్కసారి అయినా మాకు కాల్ చెయ్యడానికి ప్రయత్నించు, నీకోసం వేచి చుస్తునాం సోదరా." అని తన ట్వీట్ లో పేర్కొనింది. ధృవ్ విషయం అయి ముంబై పోలీసులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది అని పాయల్ రాజ్‌పుత్ పేర్కొన్నారు.

పిక్స్ కూడా :

తన సోదరుడి ఫోటోలను తన ట్విట్టర్ లో షేర్ చేసింది, ఇతను కనిపిస్తే చెప్పండి అని ట్వీట్ వేసింది, సోదరుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయి 3 ఏళ్ళు అవుతున్నా, అతని మీద ప్రేమ తగ్గలేదు అంటే అతనంటే పాయల్ రాజ్‌పుత్ కి ఎంత ఇష్టమో అర్ధం అవుతుంది. సోదరి కోసం అయినా ధృవ్ తిరిగి ఇంటికి వెళతాడా లేదో చూడాలి. #FindDhruv అనే ట్యాగ్ తో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది పాయల్ రాజ్‌పుత్. త్వరలోనే ధృవ్ తన ఇంటికి తిరిగి వెళ్లాలని సోషల్ మీడియా లో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, ధృవ్ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో విస్తురంగా షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఏదో ఒక రకంగా ధృవ్ దొరికితే చాలు.

Tweet:  

https://twitter.com/starlingpayal/status/1086870839209877504

No comments