Header Ads

హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రాలేదు.? టాలీవుడ్ లోనే అతి పెద్ద డిజాస్టర్స్ లో మూడవ స్థానం..కథానాయకుడు

అన్నగారి బయోపిక్ అనగానే టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. సావిత్రమ్మ బయోపిక్ మహానటి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. సావిత్రమ్మ సినిమాకే అలా ఉంటే ఇంక అన్న గారి బయోపిక్ ఏ రేంజ్ లో విద్వాంసం సృష్టిస్తుందో అని అందరూ అనుకున్నారు..

ఆరంభం అదరహో :

ఓపెనింగ్స్ అదిరిపోయాయి, హిట్ టాక్ వచ్చింది, అమెరికా లో ప్రీమియర్స్ తోనే $400k+ పైగా కలెక్ట్ చేసింది, సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి కొరటాల శివ వరకు చాలా మంది సినీ ప్రముఖులు కథానాయకుడు సినిమా పైన ప్రశంసల వర్షం కురిపించారు, క్రిష్ ఈ సినిమాని మలిచిన తీరు, బాల కృష్ణ యాక్టింగ్, ఇలా అన్ని వర్గాల్లో ఈ చిత్రం మెరిసింది.

నిడివి కారణమా.?

కథానాయకుడు సినిమా నిడివి చాలా ఎక్కువ దాదాపు 3 గంటల పాటు సాగుతుంది ఈ చిత్రం, ఈ పార్ట్ లో కేవలం అన్న గారి సినిమాల గురుంచి మాత్రమే చూపించారు, 3 గంటల సినిమా అంటే జనాలను ఆకట్టుకొనే మాస్ ఎలిమెంట్స్ కచ్చితంగా ఉండాలి, కానీ ఈ సినిమా బయోపిక్ కావడం తో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి, దీంతో జనాలు 3 గంటల సేపు నిలువలేకపోయారు.



భారీ నష్టం :

కలెక్షన్స్ పరంగా అగ్న్యాతవాసి, స్పైడర్ తరువాత డిస్ట్రిబ్యూటర్ లు నిండా మునిగిన చిత్రం ఇదే, ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్స్ కి థియేటర్ హక్కులు అమ్మారు, అంటే ఈ సినిమా హిట్ స్టేటస్ సాధించాలి అంటే ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా షేర్ ని రాబట్టాలి, కానీ ఈ చిత్రం ఇప్పటి వరకు కేవలం 20 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టగలిగింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ కి 50 కోట్లకు పైగా నష్టమనే చెప్పాలి, 50 కోట్ల నష్టం అంటే మామూలు మాటలు కాదు, ఇంత వరకు 50 కోట్ల నష్టాన్ని ఇచ్చిన చిత్రాలు రెండే ఉన్నాయ్, ఒకటి అగ్న్యాతవాసి, రెండు స్పైడర్. అగ్న్యాతవాసి 60 కోట్లకు పైగా నష్టాన్ని మిగల్చగా, స్పైడర్ 50 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చింది.

మహానాయకుడితో మాయ చేయగలడా.?

అయితే కథానాయకుడు చిత్రాన్ని కొన్న వారికే మహానాయకుడు చిత్రాన్ని ఇవ్వాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం, ఒక వేల అదే జరిగితే, మహానాయకుడు ప్లాప్ ఐన ఎంతో కొంత కలెక్షన్స్ వస్తాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతారు కొంత వరకు, ఒక వేల హిట్ అయితే, కథానాయకుడు నష్టాన్ని పూర్చి, లాభాలను తెచ్చి పెడుతుంది. అయితే రానున్న రోజుల్లో తెలియనుంది ఏం జారుతుందో.

No comments