Header Ads

పెళ్లి చేసుకోబోతున్న రిచా గంగోపాధ్యాయ్. మిరపకాయ్ భామ ను పెళ్లిచేసుకోబోయేది ఎవరో తెలుసా.?

లీడర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ్, శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ గా నటించడం అంటే మామూలు విషయం కాదు, ఆ తరువాత మిరపకాయ్, మిర్చి, నాగవల్లి, సారొచ్చారు చిత్రాల్లో నటించింది. పలు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది ఈ భామ, తెలుగు లో ఈ భామ నటించిన ఆఖరి చిత్రం భాయ్. భాయ్ సినిమాలో కింగ్ నాగార్జున సరసన నటించింది రిచా గంగోపాధ్యాయ్.




వీడుకోలు :

అయితే ఉన్నటుండి సినిమాలకు వీడుకోలు పలికింది ఈ భామ, సినిమాల్లో ఇకపైన నటించను, నా జీవితం లో సినిమా ఒక పార్ట్, సినిమా ఏ పార్ట్ కాదు. ఇంక నా జీవితం లో ఎన్నో చేయాలనుకుంటున్నా అని చెప్పింది రిచా గంగోపాధ్యాయ్. చెప్పిన విధంగానే ప్రస్తుతం రిచా గంగోపాధ్యాయ్ తన చదువుని కంటిన్యూ చేస్తుంది. అయితే రిచా గంగోపాధ్యాయ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది అని ఇటీవల జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి, ఆ వార్తలకు ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చింది రిచా గంగోపాధ్యాయ్.

అవును పెళ్లిచేసుకోబోతున్నా :

"నాకు ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది అనే విష‌యాన్ని మీతో పంచుకోవాల‌నుకుంటున్నాను. రెండేళ్ల‌క్రితం జోయ్‌, నేను బిజినెస్ స్కూల్‌లో క‌లిశాం. నా జీవితంలో త‌ర్వాతి ద‌శ గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. పెళ్లి ముహూర్తం ఇంకా ఖ‌రారు చేయ‌లేదు" అని రిచా గంగోపాధ్యాయ్ ట్వీట్ చేసింది. అయితే ఆమె అభిమానులు మాత్రం నిరాశకు లోనయ్యారు, ఆమె తిరిగి సినిమాల్లోకి రాదు అని తెలిసి బాధ పడుతున్న సమయం లో, పెళ్లి చేసుకోబోతుంది అనే విషయం తెలిసి మరింత బాధ పడ్డారు, అయినా కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు, ఫ్యాన్స్ కదా, అభినందించకుండా ఎలా ఉంటారు. అయితే ఇప్పటికీ ఈ భామ ను సినిమాల్లోకి రమ్మనే వారి సంఖ్య ఇంకా తగ్గలేదు, అభిమానం ఒక్కసారి పుడితే చచ్చే దాకా పోదు కదా.

No comments