Header Ads

కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి, కారణం ఏంటో చెప్పిన పోసాని మురళీకృష్ణ..!!

రాజకీయాల్లో నిందలు అపనిందలు సహజమే, ప్రత్యర్థి పార్టీ నేతలు ఏవో ఒక ఆరోపణలు చేస్తూ ఉంటారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరంజీవి రాజకీయాల్లోకి రావడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారన్నారు. అందుకే చిరంజీవి ఇంటి ఆడపడుచులను సైతం టీడీపీ నేతలు వీధుల్లోకిలాగారని వ్యాఖ్యానించారు, ఈ విషయాన్నీ స్వయంగా చిరంజీవి గారే నాకు చెప్పారని పోసాని మురళీకృష్ణ తెలిపారు.




షర్మిల గారిని.. : 

ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో షర్మిల గారి పైన లేని పోనీ పుకార్లు సృష్టించి ఆమె పరువు తియ్యాలని కొందరు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పోసాని మురళీకృష్ణ తెలిపారు, తెలుగుదేశం నాయకుల పైన షర్మిల మండిపడ్డారు ఈ విషయం అయి. ఆడవాళ్లకు మర్యాద ఇవ్వని పార్టీ తెలుగు దేశం పార్టీ అని పోసాని ధ్వజమెత్తారు. గతంలో కూడా అన్న గారి భార్య అయిన లక్ష్మి పార్వతి ని కావాలనే తొక్కేశారు, అన్న గారి భార్యకు గౌరవం ఇవ్వడం మాని, ఆమెనే దూషించారు అంటే తెలుగు దేశం నేతలు ఎట్టివారో తెలుస్తుందని పోసాని తెలిపారు.

చిరంజీవి గారే స్వయంగా.. :

రాజకీయాల్లోకి వచ్చాక ఇంటి ఆడపడుచులను విధుల్లోకి లాగారని చిరంజీవి గారే కంట తడి పెట్టుకొని నాతో చెప్పారు అని పోసాని తెలిపారు. యూట్యూబ్ లో మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమములో షర్మిల పైన తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పైన ఆమె కంప్లైంట్ నమోదు చేసారు.

స్వయంగా మీడియా ముందు :

షర్మిల గారు మీడియా ముందుకు వచ్చి ఆమె పైన వస్తున్న పుకార్లను, తప్పుడు ప్రచారాలను కొట్టి పడేసారు. నా పిల్లోళ్ల పైన ఒట్టేసి చెబుతున్నా, నాకు ఎటువంటి సంబంధం లేదు, నా జీవితం లో ఇంతవరకు ప్రభాస్ తో మాట్లాడటం కానీ కలవడం కానీ జరగలేదు అని షర్మిల గారు తెలిపారు. నా పైన వస్తున్న పుకార్లు నిజం అని చెప్పే వారు ప్రూఫ్స్ తీసుకొచ్చి నా లాగే ప్రమాణం చెయ్యగలరా అని మండిపడ్డారు షర్మిల. గతంలో కూడా నలుగురి పైన ఈ విషయం అయి కేసు నమోదు చేసారు పోలీసులు, ఎన్నికలు దెగ్గరికి వస్తుండటం తో మరో సారి పుకార్లు మొదలెట్టారని వైకాపా నాయకులు ప్రత్యర్థి పార్టీ నేతల పైన ధ్వజమెత్తారు.

No comments