Header Ads

నేను మరణిస్తే నా జ్ఞాపకాలు గుర్తుగా ఉంచుకో, తిరిగొస్తే .??

కొన్ని సినిమాలు మన మనసులో ఎప్పుడు పదిలంగా ఉంటాయి, అవి షార్ట్ ఫిలిమ్స్ అయినా, ఫిలిమ్స్ అయినా. ఆ కోవకే చెందింది సహేలి షార్ట్ ఫిలిం. ఈ సినిమా విడుదల అయి ఏడాది నర అవుతుంది. కానీ ఇప్పటికి ఈ సినిమాకు వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయ్, అసలు ఈ సినిమా ఎందుకు అంత పాపులర్ అయ్యిందంటే..




హీరో హీరోయిన్ కి మధ్య పరిచయానికి కారణం HEADDEACHE అనే పదమే, హీరో ఒక 100 రూపాయిల నోట్ పైన HEADDEACHE అని రాస్తాడు, ఆ నోట్ హీరోయిన్ చేతికి వస్తుంది, అసలు HEADDEACHE అంటే ఏంటి అని హీరోయిన్ అనుకుంటాది, headache అంటే తలనొప్పి మరి HEADDEACHE అంటే ఏంటా అని ఆలోచనలో పడుతుంది, హీరోయిన్ అక్క కూతురి వల్ల హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది, దాంతో HEADDEACHE అనే పదాన్ని డీకోడ్ చేస్తే హీరో నెంబర్ దొరుకుతుంది, వెంటనే కాల్ చేస్తే హీరో లిఫ్ట్ చేస్తాడు, 24 గంటల్లో తనని కనిపెట్టకపోతే ఇక ఆ తరువాత కాల్ చెయ్యొద్దని అంటుంది హీరోయిన్, రెండు నెలల్లో ఎవ్వరు క్రాక్ చేయనిది, ఒక అమ్మాయి నెంబర్ క్రాక్ చేసింది అంటే కచ్చితంగా ఇద్దరి మధ్య ఏదో ఉంది అని హీరో కూడా హీరోయిన్ కోసం అన్వేషిస్తాడు, ఆ తరువాత ఏం జరిగింది అనేదే కథ.

ఇలా షార్ట్ ఫిలిమ్స్ తో సినిమాల్లో ట్రయల్స్ వేస్తున్నారు, ఒకప్పటిలాగా స్టూడియోస్ చుట్టూ తిరిగితే అవకాశాలు రావట్లేదు, షార్ట్ ఫిలిమ్స్ తో ప్రతిభని చాటుకొని అవకాశాలు సంపాదించుకుంటున్నారు. ఇటీవల వచ్చిన టాక్సీవాలా చిత్ర హీరోయిన్ కూడా పొసెసివ్నెస్ అనే షార్ట్ ఫిలిం ద్వారా బాగా పాపులర్ అయ్యింది, ఆ షార్ట్ ఫిలిం వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతుంది, అయినా కూడా ఆ షార్ట్ ఫిలిం ఇప్పటికి జనాలకు గుర్తుంది, అప్పటికి ఇప్పటికి ప్రియాంక జవాల్కర్ చాలా చేంజ్ అయ్యింది, అసలు ఆ షార్ట్ ఫిలిం హీరోయిన్, టాక్సీవాలా లో హీరోయిన్ ఒకరే అంటే చాలా మంది నమ్మరు.

ఇంక ఇలా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ఫేమస్ అయ్యి ఎప్పటికి జనాలకు గుర్తుండిపోయేలా నిలిచిపోయాయి, ఆ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వారి టాలెంట్ బయట పడటమే కాకుండా, సినిమాల్లో అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటున్నారు , అందుకు ఉదాహరణ వైవా హర్ష. వైవా షార్ట్ ఫిలిం తో ఫేమస్ అయిన హర్ష, ఆ షార్ట్ ఫిలిం పేరు నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు, టాలీవుడ్ లో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు కమెడియన్ గా అవకాశాలు అందుకున్నాడు. రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ లో హీరో గా చేసి ఏకంగా యంగ్ హీరోస్ లో డిమాండ్ ఉన్న హీరో గా ఎదిగిపోయాడు.

Watch Video:

https://www.youtube.com/watch?v=9KVci2ukj2o

No comments