Header Ads

ట్విట్టర్ లో తనని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది చిన్మయి..

చిన్మయి శ్రీపాద ట్విట్టర్ లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటారు, ఆమెపైన వచ్చే ఆరోపణలని, ఆమెను తిట్టే వాళ్ళని ఎప్పటికప్పుడు కడిగిపారేస్తుంటారు. ఇటీవల ఒక కోలీవుడ్ పాటల రచయిత ఆమెను వేధించాడు అని పేర్కొన్నారు, #మీటూ లో భాగంగా ఆమెకు ఎదురైనా చేదు అనుభవాలని పంచుకున్నారు, ఆమె కోలీవుడ్ పాటల రచయిత గురుంచి బయట పెట్టాక ఆమెను చాలా మంది మెచ్చుకున్నారు, కానీ కొందరు ఆకతాయిలు మాత్రం ఆమెను ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు.




ట్విట్టర్ లో .. :

ట్విట్టర్ లో చిన్మయి శ్రీపాద ను అసభ్య పాద జాలం తో చాలా మంది దూషిస్తున్నారు, ఆమె వాట్సాప్ కి అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తున్నారు, నార్మల్ మెస్సగెస్ కూడా చేస్తున్నారని ఆమె పేర్కొంది. ట్విట్టర్ లో ఆమెను దూషిస్తున్న వారికి ఆమె సమాధానం ఇచ్చారు, సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారు చాలా మంది ఉంటారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అంటే సైలెంట్ గా ఉండాలేమో, వాళ్ళు ఎంత తిట్టినా కామ్ గా ఉండాలి. మళ్ళీ ఆ దరిద్రులని సార్ అన్నా అంటూ ఉండాలి. అత్యాచారం చేస్తామంటూ మూర్ఖంగా ట్వీట్స్ పెడుతున్నారు, కర్మ కాకపోతే ఇలాంటి వారు ఇంకా ఎందుకు బ్రతికున్నారో అర్ధం కావడం లేదు. ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేస్తే ఈ విషయంలో ట్విట్టర్ మాత్రం ఏం చేయగలదు ఇక పోలీసులకు కూడా భారమే అన్నట్లు చిన్మయి తన వివరణ ఇచ్చింది.

చిన్మయి భర్త రాహుల్ చిన్మయికి అండగా.. :

చిన్మయి శ్రీపాద భర్త రాహుల్ రవీంద్రన్ చిన్మయికి అండగా నిలిచాడు, తరుచు తన భార్య గురుంచి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్న వారు పని పాట లేకుండా కుర్చున్నారేమో, నా భార్య గురుంచి నాకు తెలుసు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే స్వభావం తనది. నన్ను ఎంతో ఆప్యాయంగా చుసుకుంటాది, తనకి తనకంటే నా మీదే ఎక్కువ ధ్యాస. నన్ను ఇలా ప్రేమించే అమ్మాయి నాకు దొరకడం ఎంతో అదృష్టం, ఇక పైన అయినా ఆమెను దూషించడం మానండి అంటూ ట్వీట్ చేసాడు.

చిన్మయి ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ లో ట్వీట్స్ ని చెక్ చేసుకుంటుంది, తనని ఎవరన్నా దూషిస్తూ ట్వీట్ చేస్తే వారికి గట్టిగా రిప్లై ఇస్తుంది. అయితే ఈ సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని చిన్మయి అభిమానులు చాలా మంది ఆమెను వేడుకుంటున్నారు, ప్రతి దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, సాఫీగా సాగిపోతున్న జీవితం లో కల్లోలం ఎందుకు అని చాలా మంది అభిమానులు బాధ పడుతున్నారు, ఒకరి వ్యక్తి గత అభిప్రాయాలను వ్యతిరేకించలేము, ఆమె ట్విట్టర్ విడిచి రానప్పుడు ఆమెకు ఎన్ని చెప్పిని వ్యర్ధమే అని మరి కొందరు అభిమానులు బాధ పడుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకెన్ ట్వీట్స్.. రెప్లైస్ ఉన్నాయో..

No comments