Header Ads

తరుణ్ భాస్కర్ తో నటించనున్న అనసూయ.? విజయ్ దేవరకొండ నిర్మాత.?

పెళ్లి చూపులు సినిమాతో యూత్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేసాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఆ తరువాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రం యూత్ ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ అంటే ఇష్ట పడే వారికి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. మొదటి సినిమా వంటల పైన, రెండవ సినిమా షార్ట్ ఫిలిమ్స్ పైన. కానీ ఈ రెండు సినిమాల్లో రోమాంటిక్ యాంగిల్ అండ్ కామెడీ ని చాలా బాగా తెరకెక్కించాడు తరుణ్ భాస్కర్.





హీరో గా మారనున్న తరుణ్ భాస్కర్..?

అయితే ప్రస్తుతం ఫిలిం నగర్ లో జోరుగా తరుణ్ భాస్కర్ పైన పుకార్లు వినిపిస్తున్నాయి, తరుణ్ భాస్కర్ హీరో గా ఒక సినిమా లో నటీయనున్నాడని , ఆ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన హీరోయిన్ గా అనసూయ నటించనుందని సమాచారం, అయితే ఈ విషయం మీద ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, అసలు తరుణ్ భాస్కర్ ని హీరో గా పెట్టి సినిమా తీసే నిర్మాత ఎవరని అనుకుంటున్నారా...

రౌడీ బాయ్..:

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ., ఎవడే సుబ్రహ్మణ్యం నుండి జనాలకు పరిచయమయ్యాడు, ఆ తరువాత పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో యూత్ కి కనెక్ట్ అయ్యాడు, కానీ విజయ్ దేవరకొండ ఫేట్ మార్చింది మాత్రం గీత గోవిందం సినిమా నే.. ఆ సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక పెళ్లి చూపులు సినిమాతో విజయ్ కి లైఫ్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ని హీరో గా పెట్టి తన సొంత బ్యానర్ లో ఒక మూవీ తియ్యాలని విజయ్ దేవరకొండ ఆలోచన అట. అంటే విజయ్ దేవరకొండ నిర్మాతగా, తరుణ్ భాస్కర్ హీరో గా సినిమా రానుందని సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. సొంత బ్యానర్ పెట్టి చిన్న సినిమాలు తియ్యాలని విజయ్ దేవరకొండ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు అట. మొత్తానికి తన సినిమా జీవితానికి ఒక మార్గం చూపిన తరుణ్ భాస్కర్ ని హీరో గా పెట్టి సినిమా తీస్తున్నాడు అంటే చాలా గ్రేట్.

అనసూయ ఒప్పుకుంటుందా.?

అయితే అనసూయ తరుణ్ భాస్కర్ సరసన నటించడానికి ఒప్పుకుంటుందా అన్నదే ప్రశ్న, ఎందుకంటే ఇన్ని రోజులు సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన అనసూయ, ఇప్పుడు డైరెక్ట్ గా హీరోయిన్ గా అంటే ఒప్పుకుంటుందా అని చాలా మంది అనుకుంటున్నారు, ఒక వేళ ఈ సినిమా పట్టాలెక్కి ఇందులో అనసూయ హీరోయిన్ గా నటిస్తే, విడుదలకు ముందే మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా నిలిచిపోద్ది.

No comments