Header Ads

భారతదేశంలో గూగుల్ ని ఎందుకు అంతలా ఆదరిస్తున్నారు.? సెర్చ్ నుండి మెయిల్ వరకు.. గూగుల్ స్పెషల్

గూగుల్ అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏదైనా సెర్చ్ చెయ్యాలి అంటే గూగుల్, వీడియో లు చూడాలంటె యూట్యూబ్ (గూగుల్), ఎక్కువ శాతం ఫోన్ లలో రన్ అయ్యే సిస్టం ఆండ్రాయిడ్ (గూగుల్), అత్యధిక శాతం వాడే మెయిల్స్ గూగుల్ మెయిల్స్, కొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు దారుల కోసం గూగుల్ మ్యాప్స్, ఫోటోలు వీడియోలు క్లౌడ్ లో స్టోర్ చెయ్యాలి అంటే ఎక్కువ శాతం వాడేది గూగుల్ డ్రైవ్.





ఇలా మన జీవితం లో గూగుల్ ఒక భాగం అయిపోయింది, రైల్వే స్టేషన్ లలో వైఫై అందిస్తుంది కూడా గూగుల్ ఏ, అసలు గూగుల్ అంటే మన భారతీయులకు ఎందుకు అంత ప్రేమ, నిజంగానే భారతీయులకు గూగుల్ అంటే ఇష్టమా లేక వేరే ప్రత్యామ్న్యాయం లేదా.?

సెర్చ్ తో మొదలు :

ఓకే గూగుల్ అని మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లో అంటే చాలు, వాయిస్ అసిస్టెంట్ మీకు కావాల్సిన సేవలు అందిస్తాది (అన్ని కాదు కొన్నే), మనకు ఏదైనా తెలియకపోతే వెంటనే గూగుల్ చేస్తాం, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఏ నాయకుడు ఎంత వెనకేసుకున్నాడు, ఎవరితో ఎవరు ఉన్నారు, అమ్మాయిలని / అబ్బాయిలని ఇంప్రెస్స్ చెయ్యడం ఎలా అంటూ వివిధ రకాల ప్రశ్నలు అడుగుతుంటారు గూగుల్ ని, మన వాళ్ళు గట్టిగా మాట్లాడితే జై గూగుల్ తల్లి అంటారు..

ఆండ్రాయిడ్ ఆట :

గూగుల్ తాయారు చేసిన ఆండ్రాయిడ్ సిస్టం స్మార్ట్ ఫోన్ రంగాన్నే మార్చివేసింది. ఆపిల్ కు ధీటుగానే కాకుండా, మధ్య తరగతి వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్ ని తేలికగా వాడేలాగా ఆండ్రాయిడ్ ని డిజైన్ చేసారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఆండ్రాయిడ్ ఫోన్స్ దే హవా.

యూట్యూబ్, గూగుల్ మెయిల్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ డ్రైవ్ .. :

వీడియోస్ చూడాలంటె యూట్యూబ్, ముఖ్యంగా ఏ కొత్త సినిమా ట్రైలర్ వచ్చినా, సాంగ్ వచ్చినా యూట్యూబ్ యూట్యూబ్ అంటారు మన యువత. ఇక ఎవరికైన మెయిల్ పంపియ్యాలి అంటే @gmail.com అనే అకౌంట్స్ ఏ ఎక్కువగా ఉంటాయి, ఇక తెలియని కొత్త దారుల్లో ప్రయాణించాలి అంటే గూగుల్ మ్యాప్స్ తోడు కావాల్సిందే. ఇంకా ఏవైనా ఫైల్స్, సేవ్ చేసుకోవాలి క్లౌడ్ లో అని అనుకుంటే అందుకు గూగుల్ డ్రైవ్ ఉంది.

ప్రత్యర్థి ఉన్నా పేరు లేక పరేషాన్ అవుతున్నారు :

గూగుల్ నడిపే ప్రతి ఒక్క దానికి ప్రత్యర్థి ఉన్నారు, ఒక్క ఫేస్బుక్, వాట్సాప్ లాంటి యాప్ మినహాయించి గూగుల్ అన్నిట్లో ముందు వరసలో ఉంది భరత్ లో, భారత్ లో గూగుల్ కి సరైన ప్రత్యర్థి లేకపోడం వల్ల గూగుల్ కి ఎంతో కలిసొస్తుంది.

గూగుల్ అంటే కేవలం పేరు కాదు, ఇట్స్ మోర్ దెన్ ఏ బ్రాండ్.

No comments