Header Ads

అయ్యో పాపం అని వాట్సాప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే, వచ్చి ఆమె మెడకే చుట్టుకుంది.. వాట్సాప్ వినియోగదారులుజాగ్రత్త..!!

వాట్సాప్ లో మనకు ఏదైనా మెసేజ్ వస్తే ఫార్వర్డ్ చెయ్యమని, మనము చెయ్యము, కానీ ఆ ఫార్వర్డ్ మెసేజ్ హెల్ప్ లేదా కనిపించడం లేదు ఈ నెంబర్ కి ఫోన్ చేయండి కనిపిస్తే అని అంటే అప్పుడు మనోళ్లు ఫార్వర్డ్ చేస్తారు. ఇలా మానవతా దృక్పధం ఒక ఫోటో మెసేజ్ ని ఒక మహిళ ఫార్వర్డ్ చేసి చిక్కుల్లో పడింది.




తల్లి తండ్రులకు అందే వరకు షేర్ చెయ్యండి... :

ఐదు నెలల వయసున్న పసిపాపను ఎవరో దొంగిలించి ముష్టి చేస్తుండగా, తాము పట్టుకున్నామని, పాప తమ వద్ద క్షేమంగా ఉందని, ఈ విషయం పాప తల్లిదండ్రులకు చేరేలా పది మందికీ పోస్టు ఫార్వర్డ్ చెయ్యాలంటూ కింద రెండు సెల్‌ ఫోన్‌ నెంబర్లు ఇస్తూ వాట్సప్‌ పోస్టింగ్‌ వచ్చింది తూర్పుగోదావరి జిల్లా గొల్లపాలెం అంగన్‌ వాడీ కేంద్రంలో టీచర్‌ గా పనిచేస్తున్న వరలక్ష్మికి.

ఫార్వర్డ్ చెయ్యడమే నేరం అయ్యింది. :

ఆ పోస్ట్ ని కొంత మందికి ఫార్వర్డ్ చేసింది వరలక్ష్మి, ఆమె ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ను కొందరు ఆకతాయిలు వక్రీకరించి పాప తూర్పుగోదావరి జిల్లా గొల్లపాలెం అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి దెగ్గర ఉంది అని ఇంకో పోస్ట్ తాయారు చేసి వైరల్ చేసారు. ఆ పోస్ట్ వాట్సాప్ లో వైరల్ అయ్యి అటు తిరిగి ఇటు తిరిగి ఉన్నతాధికారులకు చేరింది.

పాపను ఇవ్వు, లేని పాపను ఎక్కడినుండి తీసుకురావాలి... :

ఆ పాపను స్వాధీనం చేసుకొమని కలెక్టరేట్‌ నుంచి కాజులూరు తహసీల్దార్‌ కు, ఐసీడీఎస్‌ నుంచి అంగన్‌ వాడీ సిబ్బందికి ఆదేశాలు అందాయి. దీంతో రెవెన్యూ అధికారులు పాపను అప్పగించాలని అంగన్‌ వాడీ టీచర్ వరలక్ష్మిని డిమాండ్‌ చేసారు. దీంతో ఆమె కంగుతిన్నారు, లేని పాప ను ఎక్కడి నుండి తీసుకురావాలని ఆమె ప్రశ్నింహరు.

చేసేదేమిలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది వరలక్ష్మి. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు గొల్లపాలెం పోలీసులు, ఆమెకు వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ లో ఉన్న రెండు నెంబర్ లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అని గొల్లపాలెం ఎస్సై తెలిపారు.

మానవతా దృక్పధంతో ఫార్వర్డ్ చేసినందుకు తప్పయింది, కొందరు ఆకతాయిలు కావాలనే నన్ను ఇందులో ఇరికించారు అని వరలక్ష్మి బాధపడ్డారు. ఇక పైన అయినా ఏదైనా ఫార్వర్డ్ చెయ్యండి అని మీకు వస్తే, మీరు దానిగురుంచి విచారించి నలుగురికి ఫార్వర్డ్ చెయ్యండి.

No comments