Header Ads

జగన్, కే.టీ.ఆర్ కలయిక ఎటువైపు దారితియ్యనుంది, కేంద్రం లో పట్టు సాధించగలరా.?

వైకాపా పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, తెరాస పార్టీ అధ్యక్షుడు కే.టీ.ఆర్ బుధవారం తమ కలయికను అధికారికంగా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే తెరాస తో చేతులు కలిపాము అని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కేంద్రం లో పట్టు సాదించాలి అంటే రెండు రాష్ట్రాల్లోని ఎం.పీ సీట్ లు ఎంతో అవసరం, అయితే వీరి కలయిక ఆంధ్ర ప్రదేశ్ లో వైకాపా కు ఎటువంటి ఫలితాన్ని అందించనుంది అనే దాని పైనే ప్రశ్న.




మొదలైన మాటల తూటాలు :

వీరి కలయికను అలా ప్రకటించారో లేదో, ఇలా టీడీపీ నేతలు తెరాస, వైకాపా పైన విరుచుకుపడటం మొదలెట్టారు, ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేసిన కే.సీ.ఆర్ తో చేతులు కలిపి జగన్ కూడా ద్రోహి గా మిగిలిపోయాడు. 2019 ఎన్నికల్లో మాకు 130 సీట్ లు వస్తాయని అంచనా వేసాం, కానీ వీరి కలయిక తరువాత మాకు 160 సీట్ లు వస్తాయి అని ధీమాగా ఉన్నాం అని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఇక వైకాపా పార్టీ నేతలు టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెరాస తో కలిసాం, ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యం, అందుకోసం మన రాష్ట్ర ఎం.పీ లు ఒక్కరే సరిపోరు, తెలంగాణ రాష్ట్ర ఎం.పీ లు కూడా మనకు సహకరిస్తే కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు, కేవలం తెరాస ఏ కాదు ఫెడరల్ ఫ్రంట్ లో కలిసిన అన్ని ప్రాంతీయ పార్టీ లు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కు సహకరిస్తాం అని వెల్లడించారు, అందుకోసమే ఫెడరల్ ఫ్రంట్ తో కలిసాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిస్తే కూడా ఓర్వలేకున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు అని వైకాపా నేతలు కౌంటర్ ఇచ్చారు.

జనం మనం, మనమే జనం :

అయితే జనం మనం మనమే జనం అంటూ నాయకులూ ఎప్పుడు ముందుకు సాగుతారు, వారు ఏ పని చేసినా ఇది జనం కోసమే అని చెబుతారు, అమరావతి అయితేనేమి, ఇప్పుడు ఈ కలయిక అయితేనేమి, కానీ వీటి వల్ల జనాలకు లాభం చేకూరితే చివరికి ప్రయోజనం జనాలకే, సంతోషంగా ఉండేది వారే. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేంద్రం పైన ఒత్తిడి తేగలిగితే ప్రత్యేక హోదా కచ్చితంగా వస్తుందని చాలా మంది భావిస్తున్నారు.తెలంగాణ లో తెరాస పాలన చూసి తెరాస కు సానుకూలంగా చాలా మంది ప్రజలు ఉన్నారు ఆంధ్ర ప్రదేశ్ లో. వ్యతిరేకంగా కూడా కొంత మంది ఉన్నారు. కనుక ఎన్నికల ఫలితాల తరువాతే ఈ కలయిక వైకాపా కు మంచి చేకూరుస్తుందా చెడు చేకురుస్తుందా అని చెప్పగలం.

No comments