Header Ads

అనాధ పాప ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్, పాలిచ్చి ప్రాణం పోసింది.!!

బెంగుళూరు లో ఒక లేడీ కానిస్టేబుల్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు, ఆమెలోని మాతృభావం వల్ల ఒక పసికందు బ్రతికింది. వివరాల్లోకెళితే, బధవారం ఉదయాన్నే నగరంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసరాల్లో అత్యంత ప్రమాదకర స్థితిలో చలికి వణుకుతూ, అత్యంత దీన స్థితిలో ఉన్న ఓ పసికందును ఉదయం నడకకు వెళ్లినవారు చూసి వెంటనే బెంగళూరులోని యెలహంక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.




ఆ పాప సంబంధించిన పూర్తి వివరాలు కనుక్కొనే బాధ్యతను కానిస్టేబుల్ సంగీత హలిమణికి గారికి ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించారు. సంగీత గారు హాస్పిటల్ కి వెళ్లే సరికి పాపకు గ్లూకోస్ ఎక్కిస్తున్నారు, ఆ పాప స్థితి చూసి పాప కడుపులో ఏది లేదని గ్రహించారు సంగీత, సంగీత గారికి 10 నెలల చిన్నారి ఉండటం తో వెంటనే డాక్టర్లను అడిగి ఆ పసికందుకు పాలను అందించారు సంగీత.

కానిస్టేబుల్ సంగీత గారు మాట్లాడుతూ : "నేను ఆస్పత్రికి వెళ్లగానే ఆ పసిబిడ్డకు వైద్యులు గ్లూకోజు ఎక్కిస్తున్నట్లు కనిపించింది. కడుపులో ఆసరా లేకపోవడంతో ఆ చిన్నారి నీరసంగా ఉంది. దాంతో, వెంటనే నాకు 10 నెలల బిడ్డ ఉంది కాబట్టి, ఈ పాపకు పాలివ్వగలను అని చెప్పాను. డాక్టర్ సరే అనడంతో ఆ పసికందుకు పాలు పట్టాను, పాప శరీరమంతా దుమ్ము అంటుకుంది. చీమలు కుట్టినట్లు గాట్లు కనిపిస్తున్నాయి. ఆ బిడ్డ పరిస్థితి చూసి చలించిపోయాను" అని 25 ఏళ్లే కానిస్టేబుల్ సంగీత చెప్పారు".

పాప ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యాక నగరంలోని మరో ప్రభుత్వ ఆస్పత్రి వాని విలాస్ ఆస్పత్రికి తరలించారు. పాప శరీరం లో సరైన మోతాదులో గ్లూకోస్ లేదని, పాలు అందకపోడం తో బలహీన పడింది, ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉంది అని వైద్యులు తెలిపారు.

సంగీత గారు పాలివ్వడం తో ఆ పసికందు బ్రతికిందని డాక్టర్ లు తెలిపారు, సంగీత గారు చేసిన మంచి పనికి ఆమెను అందరూ అభినందిస్తున్నారు, ఆమె భర్త కూడా ఆమెను మెచ్చుకున్నాడు. ఇప్పటికే తనకు 10 నెలల పసి పాప ఉండటం తో ఆ పాప ను దత్తతు తీసుకోలేకపోతున్న అని సంగీత గారు బాధ పడ్డారు.

తల్లి మనసు ఎంతో గొప్పదని మహిళా కానిస్టేబుల్ సంగీత గారు మరోసారి నిరూపించారు.

No comments