Header Ads

ప్రేమికులకు అసలైన పండగ, విడిపోయే జంటల సంఖ్యా మరింత పెరగనుందా,? ఆన్‌లైన్‌లో పెళ్లి..!!

ఆన్‌లైన్‌లో మెసేజ్ లు, వీడియో కాల్ లే కాదు పెళ్లిళ్లు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు, ఒకప్పుడు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలి అంటే రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుండే, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. అదేంటి ఆన్‌లైన్‌లో పెళ్లి ఎలా సాధ్యం అనుకుంటున్నారా.? ఆన్‌లైన్‌లో పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటూ పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు నోటిఫికెషన్స్ విడుదల చేసారు, ఈ సౌలభ్యం ప్రస్తతం పశ్చిమ బెంగాల్ లో మాత్రమే అందుబాటులో ఉంది.




ఆన్‌లైన్‌లో పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు పాటించాల్సినవి :

  • ఆన్‌లైన్‌లో పశ్చిమ బెంగాల్ పెళ్లి రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చెయ్యాలి.

  • మీ అడ్రస్ ప్రూఫ్, వేలిముద్రలు, సంతకాలు, ఐడీ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాలి.
    మీకు దగ్గరలో ఉన్న రిజిస్ట్రార్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

  • ఈ ప్రక్రియలు పూర్తి అయిన తరువాత పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తుల మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి.

  • పత్రాలను పరిశీలించిన పిమ్మట పెళ్లిచేసుకోబోతున్న వారి ఇంటికి వస్తారు రిజిస్ట్రార్.

  • ముగ్గురు సాక్షులు కచ్చితంగా ఉండాలి, ముగ్గురు సాక్షుల సమక్షంలో పెళ్లిని రిజిస్ట్రార్ చేసి, వెంటనే మ్యారేజ్ సర్టిఫికెట్లను జారీ చేస్తారు రిజిస్ట్రార్.

చాలా సులువైన పని అనుకుంటున్నారు కధ, కానీ పెళ్లి తరువాత సులువు అనే పదం వింటేనే కోపం వస్తాది మీకు, ప్రేమ పెళ్లిళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియ, తప్పుగా ఉపయోగించకుండా, నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు ఈ ప్రక్రియ ద్వారా సులభంగా పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ ద్వారా విడిపోయే ప్రేమ జంటలే ఎక్కువ అవుతాయి, ఎందుకంటె పెళ్లి ఇంత సులభంగా చేసుకోవచ్చు కాబట్టి టైం పాస్ కి లవ్ చేసే వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి తొందరగా తప్పించుకుంటారు. కనుక ఈ ప్రక్రియ వల్ల కొంచెం తొందరగానే విడిపోయే అవకాశాలు ఉంటాయి ప్రేమ జంటలకు.

No comments