రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? 3 O CLOCK ను డెవిల్స్ అవర్ అని ఎందుకుఅంటారు.?
దెయ్యం… ఈ పేరు చెబితేనే మనలో అధిక శాతం మందికి గుబులు పుడుతుంది. ఇక అది రాత్రి పూట అయితే ఆ భయం వర్ణించలేం. అయితే అసలు దెయ్యాలు, భూతాలు ఉన్నాయా, లేదా అన్న సంగతి పక్కన పెడితే రోజులో ఓ సమయాన్ని మాత్రం ‘డెవిల్స్ అవర్ (Devil’s Hour)’, ‘అవర్ ఆఫ్ ది డెడ్(Hour of the Dead)’ (‘దెయ్యాల గంట’) అని పిలుస్తారట. అసలు అలా ఎందుకు పిలుస్తారు? నిజంగానే ఆ సమయంలో దెయ్యాలు తిరుగుతాయా? తదితర విషయాలను ఇప్పుడు చూద్దాం.
క్రీస్తు గురించి అందరికీ తెలుసు కదా! ఆయన తన చివరి ఘడియల్లో శిలువ వేయబడ్డాడు. అయితే ఆయనను శిలువ వేసింది మధ్యాహ్నం 3 గంటలకట. అందుకే ఆ గంట సమయాన్ని ‘గాడ్లీ అవర్ (Godly Hour)’ అని పిలుస్తారట. కాగా అందుకు పూర్తిగా విరుద్ధమైన సమయం అంటే తెల్లవారు జామున 3 గంటలను డెవిల్స్ అవర్ అని పిలుస్తారట. అప్పుడు దెయ్యాలకు శక్తి బాగా ఉంటుందట. ఆ సమయంలో దేవుళ్ల శక్తి నశిస్తుందట. ఈ క్రమంలోనే ఆ సమయంలో దెయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని, ఆ గంట పాటు వాటికి సమయం అనుకూలంగా ఉంటుందని చెబుతారు.
తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో మన శరీరంలో గుండె కొట్టుకోవడం, పల్స్ రేట్ వంటివి అసాధారణమైన రీతిలో ఉంటాయట. ఈ క్రమంలో ఆ సమయంలో మెళకువ వస్తే సహజంగానే మనకు కొంత కంగారు, ఆతురత ఉంటుందట. అయితే పైన చెప్పిన డెవిల్స్ అవర్ ప్రకారమైతే ఆ సమయంలో మెళకువ వస్తే వెంటనే పడుకోవాలని, మెళకువతో ఉండకూడదని చెబుతారు. కాగా కొన్ని మత విశ్వాసాల ప్రకారం ఆ సమయాన్నే మంచిదిగా భావిస్తారట. ఏది ఏమైనా ఆ సమయంలో మనం గాఢమైన నిద్రలో ఉంటాం కాబట్టి, అంత సాధారణంగా మెళకువ రాదు. కాకపోతే మన ఆరోగ్యం దృష్ట్యా మాత్రం ఆ టైంలో అస్సలు మెళకువతో ఉండకూడదు. అంతే కదా!

Post a Comment