Header Ads

కేటీఆర్ V/S హరీష్ రావు.! వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కారణమా..??

ఇవ్వాళ కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వడం తో హరీష్ రావు అభిమానులు ఆందోళనలు మొదలుపెట్టారు, కొన్ని 100 ల బండ్లల్లో కొన్ని వేల మంది హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు, మిమ్మల్ని తొక్కేయాలి అని చాలా మంది కుట్ర చేస్తున్నారు అన్నా, మీకు మంత్రి పదవి కూడా దక్కనివ్వకుండా చేస్తారు చూడు అన్నా అంటూ కేకలు వేస్తూ గోల గోల చేసారు అభిమానులు.
కేటీఆర్ ముందే చెప్పారు :

ఎన్నికలు జరగకముందు కేటీఆర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ : "మా ఇద్దరి కోరిక ఒకటే. కేసీఆర్ గారు మరొక 15 సంవత్సరాల పాటు ముఖ్య మంత్రిగా ఉండాలి, నాకు హరీష్ రావు గారి మధ్య వారసత్వ పోరు, ఎజెండాలు, మనస్పర్థలు పోటీ లేవు. కేసీఆర్ గారే మా పార్టీ కి పెద్ద దిక్కు. టీవీ చానెల్స్ నడపాలని లేనిపోని వణ్ణి సృష్టించి చెబుతుంటారు ఈ చానెల్స్ వాళ్ళు. కేసీఆర్ గారికి 64 ఏళ్ళు. ఈ రోజుల్లో 90, 95 ఏళ్ళు ఉన్న వాళ్లు పార్టీలను, ప్రభుత్వాలను నడుపుతున్నారు. కేసీఆర్ గారి తరువాత ఎవరు అనేది చెప్పలేము, అది ఎవ్వరం చెప్పలేం. మాకు కేసీఆర్ గారే ముఖ్య మంత్రి గా ఉండాలి, పార్టీ ని నడపాలి, ఇంకో 15, 20 సంవత్సరాల వరకు అయన పాలించాలి". అంటూ చెప్పారు కేటీఆర్.

కోపం లో హరీష్ రావు అభిమానులు :

కానీ ఇప్పుడు తెలంగాణ లో కేటీఆర్ పార్టీ బాధ్యతలు స్వీకరించడం తో హరీష్ రావు అభిమానులకి, అనుచరులకు కోపం వచ్చింది. హరీష్ రావు ని కాదని కేటీఆర్ కు ఎలా ఇచ్చారు అని మండిపడుతున్నారు, కేసీఆర్ తరువాత కేటీఆర్ ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలని ఇప్పటినుండే పావులు కలుపుతున్నారు అని హరీష్ రావు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హరీష్ రావు కు పార్టీ లో ఏదైనా పెద్ద మంత్రిత్వ శాఖ ను అప్పగిస్తారని ప్రచారం కూడా జరుగుతుంది.

సంబరాల్లో మునిగిపోయిన కేటీఆర్ అభిమానులు :

అయితే కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కడం తో సంబరాల్లో మునిగిపోయారు కేటీఆర్ అభిమానులు, అనుచరులు. కేటీఆర్ సరైన వ్యక్తి అని ఈ పదవికి, తాను మాత్రమే అందరినీ ఒక తాటి పైకి తెచ్చి సమర్థవంతంగా నడిపియ్యగలడు అని అంటున్నారు అభిమానులు.

మాస్ ఫ్యాన్ బేస్ V/S సోషల్ మీడియా ఫ్యాన్ బేస్  :

సోషల్ మీడియా లో కేటీఆర్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మాస్ జనాల్లో హరీష్ రావు కి తిరుగులేదు. ఇద్దరిలో ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. అయితే ఈ బేధాలు అభిమానులు మాత్రమే సృష్టిస్తున్నారని. కేటీఆర్, హరీష్ రావు ల మధ్య ఎటువంటి విబేధాలు లేవని తెరాస నేతలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో అంతర్యుద్ధం తప్పదా.?

No comments