Header Ads

మెగా ఫామిలీ V/S నందమూరి ఫ్యామిలీ, గొడవలకు అసలు కారకులు ఎవరు..?

నాగబాబు బాలకృష్ణ ఎవరో తెలియదు అని చెప్పిన ఒక్క మాట తో సోషల్ మీడియా అంత రచ్చ చేస్తున్నారు అభిమానులు, మెగా వర్గం ఒక వైపు, నందమూరి వర్గం ఒక వైపు అయిపోయి పరస్పరం దూషించుకుంటున్నారు.




పవన్ కళ్యాణ్ ఆ, అతనెవరో నాకు తెలియదు..! బాలకృష్ణ ఆ, అతనెవరో నాకు తెలియదు..!

కొన్ని నెలల క్రితం హీరో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు అని చెప్పారు, అప్పుడు కొంత రచ్చ జరిగినా, మళ్ళీ కొద్దీ రోజుల్లోనే సద్దుమణిగింది, ఇన్ని నెలలకు నాగబాబు బాలకృష్ణ కి కౌంటర్ వేసాడు, ఒక ఇంటర్వ్యూ లో బాలకృష్ణ గురించి మీ అభిప్రాయం తెలపండి అని నాగబాబు ని అడిగితే, బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అంటూ సమాధానమిచ్చాడు నాగబాబు .

మంటలు ఆర్పుతాడు అనుకుంటే పెట్రోల్, కిరోసిన్, డీజిల్ పోసాడు నాగబాబు.!!

నాగబాబు చేసిన వ్యాఖ్యల వల్ల నందమూరి ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. నాగబాబు ని ట్రోల్ చెయ్యడం మొదలెట్టారు, అదే సమయం లో మెగా ఫ్యాన్స్ నాగబాబు కి సపోర్ట్ గా నిలిచారు, ఇలా మొదలయ్యాయి మళ్ళీ గొడవలు. అయితే నాగబాబు బాలకృష్ణ ఎవరో తెలియదు అని అన్నందుకు క్షమాపణ చెబుతూ ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు, ఆ వీడియో లో నాగబాబు మాట్లాడుతూ: " బాలకృష్ణ ఎవరో తెలియదు అన్నందుకు చాలా బాధ పడుతున్నా, తప్పు నాదే, అంతటి గొప్ప నటుడ్ని మర్చిపోడం నిజంగా నా తప్పే, ఆయన చాలా మంచి కమెడియన్. ఎన్టీఆర్, కృష్ణ గారితో కూడా అయన అప్పట్లో నటించారు, హాస్యం పండించడంలో ఆయనది ఒకరకమైన స్టైల్, బాలకృష్ణ గారి గురుంచి ఎంత చెప్పినా తక్కువే. బాలకృష్ణ గారి పూర్తి పేరు వల్లూరి బాలకృష్ణ, మీరు కావాలంటే వికీపీడియా లో సేర్చ్ చేసి అయన హిస్టరీ తెలుసుకోవచ్చు" అని ఫేస్బుక్ వీడియో లో చేప్పాడు నాగబాబు..

ఈ వీడియో తో అసలే రెచ్చిపోతున్న ఫ్యాన్స్ ని ఇంకా రెచ్చగొట్టినట్టు అయ్యింది. అసలు నాగబాబు ఈ సమయం లో ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడానికి గల కారణాలు ఏంటి అనేదాని పైన కూడా సర్వత్రా చర్చించుకుంటున్నారు. బాలకృష్ణ పైన కౌంటర్ వెయ్యడానికి అసలు ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఏముంది.? ఒక వేళ నిజంగానే వల్లూరి బాలకృష్ణ గురించి మాట్లాడాడా, లేక వ్యంగ్యంగా విరుచుకుపడ్డాడా? నెటిజన్స్ మాత్రం బాలకృష్ణ ను డైరెక్ట్ గా అనలేక వ్యంగ్యంగా అన్నాడని అనుకుంటున్నారు.

ఈ రచ్చ ఆగేదెప్పుడో..??

No comments