Header Ads

కోతి ని తోలడం మానేసి, దానితోనే తోలించినందుకు తిప్పలు పడుతున్న RTC డ్రైవర్.!!

ఈ మధ్య కాలం లో RTC బస్సు లలో చాలా ప్రమాదాలు జరిగాయి, ముఖ్యంగా ఇటీవల కొండగట్టు ప్రాంతం లో జరిగిన ఘటన అత్యంత బాధాకరమైనది, RTC బస్సు డ్రైవర్ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా పదుల సంఖ్యలో ప్రాణాలు పోతాయి, అలాంటిది ఒక RTC బస్సు డ్రైవర్ కోతి చేత డ్రైవ్ చేయించాడు, ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు, ప్రయాణం మధ్యలో వచ్చి డ్రైవర్ ఒడిలో కూర్చుంది, డ్రైవర్ ఆ కోతి చేతికి స్టీరింగ్ ఇచ్చాడు, కోతి బస్సు నడుపుతుండగా ఎవరో వీడియో తీశారు, ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.




ఆ వీడియో కర్ణాటక ర్టీసీ అధికారులు, డ్రైవర్ ని సస్పెండ్ చేసారు, ఆ బస్సు లో ప్రయాణించిన జనాలు ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వలేదు డ్రైవర్ పైన, అయిన కూడా ఇలా చేయడం తప్పు కాబట్టి అతని సస్పెండ్ చేసాం. ప్రస్తుతం డ్రైవర్ ని విచారిస్తున్నారు, కోతి ని తోలడం మానేసి, దానితోనే తోలించినందుకు తిప్పలు పడుతున్నాడు డ్రైవర్.

రోడ్ ప్రమాదాలు తరుచు జరుగుతూనే ఉంటాయి, మనం సక్రమంగా నడిపినా, అవుతల వ్యక్తి అడ్డ దిడ్డంగా వచ్చి మనల్ని గుద్దితే తనకే కాదు, మనకు నష్టం వాటిళ్లుతుంది, చాలా సందర్గ్బాల్లో ప్రాణాలే పోతాయి, అందుకే RTC డ్రైవర్ అయిన, మాములు బండ్లు నడిపే వాళ్ళు అయిన, జాగ్రత్తగా నడపండి.

No comments