Header Ads

నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి..!! అమ్మ నాన్న లను వీడకండి..? Real Story.

నేను 10వ తరగతి లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ని ప్రేమించాను, ఆ అమ్మాయి ఏ నా జీవితం అనుకున్నా, తన వెంట పడని రోజంటూ లేదు, 4 సంవత్సరాల తరువాత నా ప్రేమను అంగీకరించింది. ఒక సంవత్సరం పాటు ఇరువురం బాగానే మాట్లాడుకున్నాం, ప్రతి రోజు మెసేజ్ లు, అప్పుడప్పుడు కాల్స్. కానీ ఆ అమ్మాయి ని మాత్రం నేను కలవలేదు.




మా ఊరికి చాలా దూరం వెళ్లి ఉదోగం చేస్తున్నాను, మా ఊరికి మూడు నెలలకి ఒక సారి వచ్చే వాడిని, వచ్చిన ప్రతి సారి నేను ప్రేమించిన అమ్మాయి ని కలవాలి అని అనుకొనే వాడిని, ముందు తను కూడా కలుస్తా అని చెప్పేది, కానీ నేను మా ఊరికి వెళ్లిన ప్రతి సారి, ఏదో ఒకటి చెప్పి నన్ను కలిసేది కాదు.

నా ప్రేమను అంగీకరించి సంవత్సరం దాటిపోయింది, తన చదువు కూడా అయిపోవచ్చింది, నేను నెలకి RS.25,000 సంపాదిస్తున్న, ఇక ఇదే మంచి సమయం, వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్న, అంత లోపే తనకి తన బావ తో ఇంట్లో వాళ్ళు సంబంధం చూసారు, బావ ని పెళ్లి చేసుకోడానికి తాను అంగీకరించింది.

ఈ విషయం అయి నేను తనని అడిగితే. తను మాట్లాడుతూ: "మా ఇంట్లో వాళ్ళు నీకు ఇచ్చి చెయ్యరు, మా బావ నెలకి RS.75,000 సంపాదిస్తాడు, మా బావ చేస్తున్న కంపెనీ లోనే నాకు జాబ్ ఇప్పిస్తా అని కూడా చెప్పారు. నువ్వు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నావ్, నీకు నాకంటే మంచి అమ్మాయి వస్తాది, ఇకపైన నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యకు" అని చెప్పేసి వెళ్ళిపోయింది. అంతే నేను పిచ్చోడిని అయిపోయా, నిండా తాగడం పడుకోడం మళ్ళీ లేసి తాగడం.

ఒక నెల రోజులు ఆ బాధ నుండి బయటికి రాలేదు, ఉద్యోగం మానేశా. తనకి పెళ్లి అయిపోయింది, తన పెళ్ళికి కూడా వెళ్ళాను. ఎంతో సంతోషంగా ఉంది తను పెళ్ళిలో. అంతే, ఆ రోజు తనని అలాగ చూసాక మా అమ్మ నాన్న గుర్తు వచ్చారు, తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటాది, కానీ మా అమ్మ నాన్న లకు నేను ఒక్కడినే, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాల్సిన సమయం లో వాళ్ళకి భారం కా దలుచుకోలేదు.

అందుకే అన్నీ పక్కన పెట్టి మరల జాబ్ లో జాయిన్ అయ్యా, 4 నెలలు అవుతుంది మందు ముట్టక, ప్రస్తుతం నెలకు RS.35,000 సంపాదిస్తున్న. నా నెల ఖర్చులకు ఒక RS.10,000 దెగ్గర పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి మిగిలిన డబ్బులు పంపిస్తున్న.

అమ్మాయి వదిలేసిందన్న బాధలో అమ్మ నాన్నలను కూడా వదిలేస్తున్నాం, అందుకే అమ్మాయి వదిలేస్తే ఇంకా కష్ట పడి అమ్మ నాన్న లను బాగా చూసుకోండి. అమ్మాయి ని ప్రేమించండి, కానీ ఆ ప్రేమ నిలబడకపోతే నిరుత్సాహ పడకండి, జీవితం లో ముందుకు సాగండి ధైర్యం తో.







No comments