Header Ads

వెంకటేష్, వరుణ్ తేజ్ ల F2 టీజర్ అదిరిపోయింది, అల్లుళ్ళ కు తిప్పలు తప్పవు.!!

వెంకటేష్ వరుణ్ తేజ్ హీరో లుగా నటిస్తున్న 'F2' చిత్ర టీజర్ ని ఇవ్వాళ విడుదల చేసారు, సంక్రాంతి కానుకగా రానున్న ఈ సినిమా లో మెహ్రీన్, తమన్నా హీరోయిన్ లుగా నటించారు, అనిల్ రావి పూడి F2 చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర టీజర్ మీకోసం:
సంక్రాంతి కి అల్లుళ్ళు థియేటర్ లలో కామెడీ పంచడానికి మన ముందుకు రానున్నారు, ప్రకాష్ రాజ్ F2 చిత్రం లో ముఖ్య పాత్రా పోషించారు, వినయ విధేయ రామ, కథానాయకుడు సినిమాలకు F2 చిత్రం ఎంత మేరకు పోటీనిస్తుందనేది విడుదల తరువాత తెలుస్తుంది. సినిమాలో మాత్రం అల్లుళ్ళ కు తిప్పలు తప్పవు, టీజర్ లోనే సినిమా ప్లాట్ రెవీల్ చెయ్యడంతో. అనిల్ రావిపూడి గత చిత్రాల మాదిరిగానే హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చే చిత్రం గా ఈ చిత్రం ఉండనుంది అని టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది, చాలా రోజుల తరువాత విక్టరీ వెంకటేష్ ఒక కంప్లీట్ హాస్యానికి ప్రాధాన్యం ఉన్న సినిమాలో నటించారు, వరుణ్ తేజ్ కి కూడా ఈ తరహా చిత్రం కొత్త. అల్లుళ్ళ హుంగామ సంక్రాంతి కి థియేటర్ లలో మొదలవుతుంది.

No comments