Header Ads

అదరగొడుతున్న సముద్రపుత్రుడు. DC ఫ్యాన్స్ కి ఫుల్ పండగే..!!

AQUAMAN( తెలుగు లో సముద్రపుత్రుడు గా అనువదించారు ) సినిమా కు పాజిటివ్ టాక్ రావడం తో DC ఫ్యాన్స్ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి, ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. 3D సినిమా కావడం తో మనోళ్లు ఇంక అస్సలు ఆగట్లేదు.





గత వారమే చైనా లో AQUAMAN విడుదలయ్యింది, అక్కడ బీభత్సమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. AQUAMAN సినిమా తో 1B$ మార్క్ ను దాటుతాడో లేదో చూడాలి. DC సూపర్ హీరోస్ సినిమాల్లో బ్యాట్మాన్ మాత్రమే రెండు చిత్రాలతో  ప్రపంచవ్యాప్తంగా 1B$ మార్క్ ను అందుకున్నాడు, ఆ తరువాత వచ్చిన DC సూపర్ హీరో ల చిత్రాలేవీ ఆ మార్క్ ను అందుకోలేక పోయాయి, గత సంవత్సరం విడుదల అయిన జస్టిస్ లీగ్ బాక్స్ ఆఫీస్ అంచనాలను అందుకోలేక పోయింది, MARVEL సూపర్ హీరోస్ ఎప్పుడు DC సూపర్ హీరోస్ కంటే ముందే ఉంటారు కలెక్షన్స్ విషయం లో. ఇప్పుడు AQUAMAN ఆ లెక్క ను మర్చి DC సూపర్ హీరో ల సినిమాల్లో అత్యధికంగా కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచిపోతుందని DC ఫ్యాన్స్ నమ్మకం తో ఉన్నారు.

AQUAMAN అమెరికా లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేదాని పైన సర్వత్రా ఆసక్తి ఉంది, అమెరికా లో డిసెంబర్ 21 న విడుదల కానుంది, చైనా లో విడుదల అయిన వీకెండ్ లోనే $94M డాలర్లను కొల్లగొట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. చైనా లో DC మూవీస్ లో అత్యధిక భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా AQUAMAN రికార్డు సృష్టించింది.

ఈ సంవత్సరం ముగిసే సరికి AQUAMAN ఫైనల్ కలెక్షన్స్ మీద ఒక అంచనాకు రావొచ్చు. ప్రస్తుతానికి అయితే 1B$ ను అందుకోడం సులభమే AQUAMAN చిత్రానికి. ఇక ముందు రానున్న DC సూపర్ హీరో ల చిత్రాలకు మంచి ఊపునిచ్చింది AQUAMAN చిత్రం.

No comments