Header Ads

ఆన్లైన్ లో పాత నోట్లకు భారీ డిమాండ్ .. ఇంతకీ ఆ నోట్లను ఎవరు కొంటున్నారో తెలుసా.?

ఆన్ లైన్ లో ఏ టైం కి ఏది ట్రెండ్ అవుతాదో ఎవ్వరూ చెప్పలేరు, ఆన్ లైన్ పుణ్యమా అంటూ పనికిరాని వస్తువులకు కూడా బాగా డిమాండ్ పెరిగింది, అసలు పనికి రాని వస్తువులకు డిమాండ్ ఎందుకు అనుకుంటున్నారా.? పనికి రాని వస్తువులకు డిమాండ్ ఉండటానికి కారణం, అవి చూపించుకోడానికి ఉంటాయి అని. ఉదాహరణ కి ఒకప్పటి 1000 రూపాయిల నోటు ఎలా ఉంటాదో ఇప్పుడు పుట్టిన పిల్ల వాళ్లకు తెలీదు, కానీ ఎవరి దెగ్గర అయినా ఆ పాత 1000 రూపాయిల నోటు ఉంటే, ఆ నోటు చూడటానికి ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. ఆ ఆసక్తి ని కాష్ చేసుకోవాలంటే ఆన్ లైన్ వేదికగా మారింది.




పాత 500,1000 రూపాయిల నోట్లకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది.

అదేంటి, కనుమరుగైపోయిన నోట్లకు డిమాండ్ పెరగడం ఏంటని అనుకుంటున్నారా.? పాత నోట్లను, కాయిన్స్ ను కలెక్ట్ చేసే వారి సంఖ్యా మన దేశం లో ఎక్కువగానే ఉంది, మన దెగ్గర పాత 500,1000 రూపాయిల నోట్లు ఉన్నప్పుడు, ఎగబడి మరి బ్యాంకు లో నోట్ లను డిపాజిట్ చేసాం, కనీసం ఒక్క నోటు కూడా దెగ్గర పెట్టుకోలేదు. కేవలం కొంత మంది మాత్రమే నోట్లను దాచి పెట్టుకున్నారు గుర్తు కోసం, ఆలా దాచి పెట్టుకున్న వారికి ఇప్పుడు పండగ అనే చెప్పాలి.

మన దేశం లో అలా చేస్తే నేరం :

మన దేశం లో కరెన్సీ నోట్లను అమ్మడం చట్ట రీత్యా నేరం, ఇక్కడే ఆన్ లైన్ బిజినెస్ మన వాళ్ళకి కలిసి వచ్చింది, ఫారిన్ వెబ్ సైట్స్ పుణ్యమా అంటూ వాటి ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు, ఈ నోట్ల విలువ కాలం ముందుకు సాగుతున్న కొద్దీ విలువ కూడా పెరుగుతుంది. ఇటీవలే పాత రెండు రూపాయిల నాణెం కి మంచి మార్కెట్ విలువ వచ్చింది, ఇప్పుడు పాత 500,1000 రూపాయిల నోట్లకి గిరాకీ పెరిగింది, మీ దెగ్గర పాత 500,1000 రూపాయిల నోట్లు ఎక్కువగా ఉంటె అమ్మేయండి, కానీ గుర్తుగా ఒక 500.1000 రూపాయిల నోటు మీ దెగ్గర పెట్టుకోండి, లేకుంటే మీరు అమ్మిన నోట్లనే మళ్ళీ మీరే కొనే పరిస్థితి రావొచ్చు.



No comments