Header Ads

సినిమా ప‌వ‌ర్‌ఫుల్ ఫ్లాట్‌ఫాం - క‌త్తితో కాసేపు.!!

విలువ‌లే ప్రాధాన్యం. వ్య‌వ‌స్థ‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేసేది సినిమాలే. వేల మాట‌లు చెప్ప‌లేని భావాల‌ను ఒకే ఒక్క దృశ్యం ఆవిష్క‌రిస్తుంది. అందుకే సినిమా అన్న‌ది అత్యంత శ‌క్తివంత‌మైన సాధానం. ఇందు కోసం ప్ర‌తి స‌న్నివేశాన్ని మ‌రింత బ‌లంగా తీసుకు రావాల‌న్న త‌ప‌న ప్ర‌తి డైరెక్ట‌ర్‌లోనూ వుంటుంది. ఇది ఒక ర‌కంగా చెప్పాలంటే పురిటి నొప్పులు అనుభ‌వించ‌డ‌మే. ఒక్కోసారి షాట్ పూర్త‌వకుండానే ప్యాక‌ప్ చెప్పాల్సి వ‌స్తుంది. ఇంకోసారి అనుకోకుండానే స్క్రిప్ట్ లోని స‌న్నివేశాలు మరింత త్వ‌ర‌గా పూర్త‌యి పోతాయి. ఇదే సిత్రం. విచిత్రం కూడా. రోజూ వారీ జీవిత‌పు ప్ర‌యాణంలో చోటు చేసుకునే సంఘ‌ట‌న‌లే సినిమా మాధ్య‌మానికి ఇతివృత్తాలు. ఇవే పాత్ర‌లుగా క‌ళ్ల ముందు త‌చ్చ‌ట్లాడుతాయి. వీటికి ప్రాణం పోయాలంటే క‌థ ఇంకా శ‌క్తివంతంగా ఉండాలి. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు మాట‌లు పండించాలి. వీట‌న్నింటి కంటే పాత్ర‌దారులు ఇందులో లీనం కావాలి. లేక‌పోతే డైరెక్ట‌ర్ ఎంత క‌ష్ట‌ప‌డినా ఫ‌లితం ద‌క్కదంటున్నారు ర‌చ‌యిత‌. .అన‌లిస్టు. .న‌టుడు. .డైరెక్ట‌ర్ క‌త్తి మ‌హేష్‌.
డైరెక్ట‌ర్‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు - నిబ‌ద్ధ‌త ..స‌మాజం ప‌ట్ల అవ‌గాహ‌న అంత‌కంటే మ‌న‌కంటూ ఓ గ‌మ్యం. ఏం చెప్పాల‌కున్నామో ముందుగానే ఓ రిపోర్టు ఉండాల్సిందే. ఏది ప‌నికి వ‌స్తుందో..ఏది ఎంత వ‌ర‌కు వాడాలో తెలియ‌టం. కుటుంబ వ్య‌వ‌స్త‌ను అర్థం చేసుకోకుండా..సామాజిక గ‌మ‌నాన్ని గ‌మ‌నించ‌కుండ ఆ సినిమాల‌ను తీయాల‌ను కోవ‌డం..ఓ భ్రమ‌. సాహిత్య రంగాన్ని, క‌ళా రంగాన్ని విస్తృతంగా అధ్య‌య‌నం చేయాలి. ప్ర‌తి స‌న్నివేశాన్ని హ‌త్తుకునేలా ఎప్ప‌టిక‌ప్పుడు రాసుకుంటూ పోవాలి. నిత్యం జ‌రిగే సంఘ‌ట‌న‌లు, స‌న్నివేశాలే స్ఫూర్తిని క‌లిగిస్తుంటాయి. వాటిని దాటి ఎక్క‌డికీ వెళ్ల‌లేం. ఇక్క‌డ ఎలాంటి ప‌రిమితులు అంటూ ఉండ‌వు. అన్నీ మ‌నం క‌ల్పించుకున్న‌వే. క‌ల్ప‌న‌కు అభూత క‌ల్ప‌న‌కు మ‌ధ్య చిన్న‌పాటి గీతే ఎవ‌రు ఫ‌ర్‌ఫెక్ట్ అన్న‌ది తేలుతుంది. అంతే త‌ప్పా ఎవ‌రూ గోల్డ్ స్ఫూన్‌తో పుట్ట‌రు క‌దా..సినిమా రంగంలో రాణించాలంటే అన్ని రంగాల్లో అవ‌గాహ‌న క‌లిగి ఉండాల్సిందే. లేక‌పోతే దేని మీదా మ‌న‌కు ఆధిప‌త్యం అంటూ ఉండ‌దు. అప్పుడు ఆర్టిస్టుల‌తో మ‌న‌కు కావాల్సిన విధంగా పాత్ర‌ల‌కు న్యాయం చేయ‌లేం.

నేటి మీడియా పోక‌డ‌ల‌కు నిద‌ర్శ‌నం రిపోర్ట‌ర్ - ఎంతో క‌ష్ట‌ప‌డి తీసిన సినిమా ఇది. టీజ‌ర్‌, మూవీకి రెస్పాన్స్ వ‌చ్చింది. కొన్ని థియేట‌ర్లే ద‌క్కాయి. ఇదంతా హెవీ రిస్క్‌. డైరెక్ట‌ర్‌గా ఆనంద‌ప‌డ్డా. సామాజిక నిబద్ధ‌త క‌లిగిన డైరెక్ట‌ర్ ఎన్‌. శంక‌ర్‌ను ఇందులో న‌టించేలా చేశా. ఒప్పుకోడ‌నుకున్నా..కానీ ఒప్పించా. నా పై ఉన్న అభిమానంతో కాద‌న‌లేక పోయారు. సినిమాలో ఈజీగా న‌టించారు. కౌశిక్ పాత్ర హైలెట్‌. ఇప్పుడున్న మీడియా ఏవిధంగా ఉందో తెలియ చేసే ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా. టెక్నిక‌ల్‌గా తెలివి ఉండాల్సిందే. స‌త్య‌జిత్ రే, మృణాళ్ సేన్‌, గౌతం గోస్‌. ఆదూర్ గోపాల‌కృష్ణ‌న్‌, ఇలా ఎంద‌రో ఇండియ‌న్స్ సినిమాను సుసంప‌న్నం చేశారు. టెక్నిక‌ల్‌గా రిచ్‌గా ఉండాలంటే సినిమా సందేశాన్ని తీసుకెళ్లాలంటే నైపుణ్యం ఉండాల్సందే. లేక‌పోతే అవుట్‌పుట్‌ను స‌రిగా వినియోగించుకోలేక పోతాం. మ‌న మీద మ‌న‌కు ప‌ట్టు ఉండ‌ట‌మే సినిమా స‌క్సెస్‌కు మొద‌టి మెట్టు.

క్రియేటివిటికి ..ఐడియాకు తేడా ఏమైనా ఉందా? - క‌ళాకారులు, ఆర్టిస్టులు, సృజ‌న‌కారులు ఏదో ఒక ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంటారు. ఆర్టిస్టిక్ ఫీలింగ్స్ లేక‌పోతే దేనికి ప‌నికి రాకుండా పోతాం. ఈ సినిమా రంగంలో రాణించాలంటే కొన్ని అల‌వాటు చేసుకోవాలి. ఇంకొన్నింటిని వంట ప‌ట్టించు కోవాలి. బాగా సాధ‌న చేస్తూనే ఉండాలి. ఎక్క‌డా నిలిచి పోకూడ‌దు. ఇంకెక్క‌డా ఆగిపోరాదంటారు క‌త్తి. స‌మాజంలో ఎక్కువ‌గా బాధ్య‌త క‌లిగిన వ్య‌వ‌స్థ పాత్రికేయ‌, మీడియా రంగానిది. రిపోర్ట‌ర్ అన్న ప‌దం ఓ ఐకాన్. ఓ సింబ‌ల్‌. స‌మ‌కాలీన వ్య‌వ‌స్థ‌లో ఎంతో గౌర‌వ ప్ర‌ద‌మైన వృత్తి. అందుకే దానిని ఎంచుకున్నా. రిపోర్ట‌ర్ అన్న ప‌ద‌మే గొప్ప శ‌క్తిని ఇస్తుంది. కొంద‌రు ఈ వృత్తికి పూర్తిగా న్యాయం చేయ‌లేక పోతున్నార‌నే ఆవేద‌న‌కు ప్ర‌తిరూప‌మే ఈ మూవీ. వ్య‌వ‌స్థ‌లోని వికృత పోక‌డ‌లు, కుటుంబ నేప‌థ్యం. రోజూ వారీ స‌మ‌స్య‌లు. ఇలాంటి వాటి మ‌ధ్య న‌లిగి పోయే రిపోర్ట‌ర్ క‌థ .

సొసైటీకి ప్ర‌తిబింబ‌మే సినిమా - ఇంకా ఈ స‌భ్య స‌మాజంలో జ‌ర్న‌లిస్టిక్ విలువ‌లున్నాయ‌ని చెప్ప‌డ‌మే దీని ఉద్ధేశం. ప్ర‌తి వ్య‌వ‌స్థ‌లో..ప్ర‌తి రంగంలో మంచి చెడు ఉంటుంది. చాలా మంది జ‌ర్న‌లిస్టులు విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నారు. మాన‌వ‌తా క‌థ‌నాలు రాస్తున్నారు. ప్ర‌సారం చేస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకు వ‌స్తున్నారు. న‌టించ‌డం..రాయ‌డం..చ‌ద‌వ‌డం నా ప్రాణం. సోష‌ల్ వ‌ర్క్ కూడా. హృద‌య కాలేయం ..పెస‌ర‌ట్టు..కొంత కాంట్ర‌వ‌ర్షియ‌ల్‌..కొన్ని విష‌యాల్లో..ప్ర‌భుత్వం న‌న్ను బ‌హిష్క‌ర‌ణ చేయ‌డం..ఇవ‌న్నీ వ్య‌క్తిగ‌తం. సినిమా ఓ శ‌క్తివంత‌మైన సాధ‌నం. ఎవ‌రిపైనా ఆధార ప‌డ‌కండి. యువ‌తీ యువ‌కులు చ‌దువు కోవాలి. సామాజిక నేప‌థ్యం క‌లిగేలా ఎప్ప‌టిక‌ప్పుడు తీర్చిదిద్దు కోవాలి. క‌ష్ట‌ప‌డాలి..స‌క్సెస్ ఈజ్ నాట్ ఏ వే..అదో అంతులేని జ‌ర్నీ అంటున్నారు క‌త్తి.

No comments