Header Ads

చిన‌జీయ‌ర్ స్వామి ఆశీర్వాదం - గులాబీ బాస్‌కు బ‌లం

రెండోసారి ముచ్చ‌ట‌గా తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత శ్రీ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు ముందు నుంచి సెంటిమెంట్లు ఎక్కువ‌. మేధావిగా. ర‌చ‌యిత‌గా క‌విగా గాయ‌కుడిగా. ప‌రిపాల‌నాద‌క్షుడిగా నాయ‌కుడిగా ఉద్య‌మ‌కారుడిగా. ముంద‌స్తు విజ‌న్ క‌లిగిన రాజ‌కీయ నేత‌గా ఆయ‌న‌కు పేరుంది. మాట‌ల మాంత్రికుడిగా ..బ‌హు భాషా కోవిదుడిగా..సాహిత్యకారుడిగా ఎన్నో పార్శ్వాలు ఆయ‌న‌లో ఉన్నాయి. అన్నింటికంటే కేసీఆర్ అప‌ర భ‌క్తుడు. ముందు నుంచి పెద్ద‌ల‌న్నా గౌర‌వ భావం ఎక్కువ‌. త‌న‌కు పాఠాలు నేర్పిన గురువుల‌ను స్మ‌రించు కోవ‌డం..త‌న చిన్న‌నాటి స్నేహితుల కుటుంబాల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌కు ఆయ‌న పెట్టింది పేరు.
తెలంగాణ‌కు ఏం కావాలో..ఏం కోల్పోయిందో..ఏయే అవ‌కాశాలు..వ‌న‌రులు ..ప్రాజెక్టులు..నీటి పారుద‌ల‌..చెరువులు..ఇలా చెప్పుకుంటూ పోతే ..ఇన్మ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ లో కూడా పొల్లు పోకుండా చెప్ప‌డం కేసీఆర్ స్పెషాలిటీ. అద్భుత‌మైన క‌వితలు చెప్ప‌గ‌ల‌రు..ప‌ద్యాలంటే ఆయ‌న‌కు పంచ ప్రాణం. కొడుకు, బిడ్డ‌..అల్లుడు..అంత‌కంటే మ‌నుమ‌డు ..మ‌నుమ‌రాళ్లు..సోద‌రీమ‌ణులు అంటే ప్రేమ‌. వాళ్ల ఆశీర్వాద బ‌ల‌మే త‌న‌కు అండ అంటారు చాలాసార్లు. న‌మ్మ‌కాలు, సెంటిమెంట్లు, ముహూర్తాలు..పూజ‌లు..పండితుల‌ను స‌త్క‌రించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. గుళ్లు, గోపురాలు..దేవాల‌యాలు, ప్ర‌ద‌ర్శ‌నీయ స్థ‌లాలు, చారిత్రిక ప్రాంతాల గురించి కేసీఆర్‌కు తెలిసినంత‌గా ఇంకే నేత‌కు తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు. మ‌ల్ల‌న్న‌, వేముల‌వాడ‌, తిరుమ‌ల, విజ‌య‌వాడ‌లోని దుర్గ ఆల‌యాల‌ను ద‌ర్శించుకున్నారు. తిరుప‌తికి ధీటుగా యాద‌గిరిగుట్ట దేవాల‌యాన్ని తీర్చి దిద్దాల‌న్న సంక‌ల్పం కేసీఆర్‌కే చెల్లింది. ఏ ముఖ్య‌మంత్రి హ‌యాంలోను ఆల‌యాల‌కు ప్ర‌యారిటీ లేకుండా పోయింది. కేసీఆర్ ప‌రిపాల‌న‌లో ఆల‌యాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. పూజారుల‌కు, సిబ్బందికి జీతాలు పెంచారు. వారికి ఉద్యోగ‌స్తుల‌తో స‌మానంగా ట్రెజ‌రీ ద్వారా జీతాలు చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ప్ర‌తి ఒక్క పేద బ్రాహ్మ‌ణుడికి సాయం అందేలా చేశారు. బ్రాహ్మ‌ణుల కోసం వేద పాఠ‌శాల‌లు, ఇత‌ర దేశాల‌కు వెళ్లేందుకు ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. వారి కోసం బ్రాహ్మ‌ణ భ‌వ‌న్ నిర్మించేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు.

పండితులు, పామ‌రులు, భ‌క్తులు, దేవాల‌యాల ఛైర్మ‌న్లు, బ్రాహ్మ‌ణ స‌మాజం మొత్తం కేసీఆర్‌ను ..ఆయ‌న కుటుంబాన్ని దీవించాయి. వేలాది మంది పూజారుల‌ను, స్వాముల‌ను, పీఠాధిప‌తుల‌ను స‌త్క‌రించి..స‌న్మానించారు. భారీ ఎత్తున న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో యాగాలు నిర్వ‌హించారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా డోంట్ కేర్ అన్నారు. ఏకంగా త‌న సీటుపై శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామీజీని కూర్చోబెట్టారు. దీనిపై విపక్షాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేసినా..త‌న మాటే నెగ్గించుకున్నారు. బ్ర‌హ్మ ముహూర్తం చూసుకుంటారు. గ‌డియ‌లు, తిథులు, న‌క్ష‌త్రాలు..ఇలా ప్ర‌తిదీ ఓ లెక్క ప్ర‌కారం చూసుకుని ప‌రిపాల‌న సాగిస్తారు. తిరుప‌తికి ధీటుగా యాదాద్రిని చేయాల‌న్న ల‌క్ష్యంతో కేసీఆర్ ..చిన్న‌జీయ‌ర్ స్వామికి పూర్తిగా అప్ప‌గించారు. ఇపుడు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆల‌యం కొత్త సొబ‌గుల‌తో ఆక‌ట్టుకుంటోంది. అక్క‌డ నిత్యం పూజాది కార్య‌క్ర‌మాలు జ‌రుగుతూ ఉన్నాయి. యాదాద్రి ఆల‌య అభివృద్ధి క‌మిటీని ఏర్పాటు చేశారు. శిల్ప‌క‌ళా నైపుణ్యానికి ఆ ఆల‌యం ప్ర‌తీకగా నిల‌వ‌నుంది. ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇదంతా చిన్న‌జీయ‌ర్ స్వామి వారే చూస్తున్నారు.

ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌న్నా చిన‌జీయ‌ర్ స్వామిని సంప్ర‌దించ‌డం అల‌వాటు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ కుటుంబ స‌మేతంగా శంషాబాద్ ద‌గ్గ‌ర‌లో ఉన్న దివ్య సాకేతం ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. అక్క‌డ జీయ‌ర్ ఆశీస్సులు అందుకున్నారు. అసెంబ్లీ ర‌ద్దు ద‌గ్గ‌ర నుండి ..అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌..బి ఫారంలు ఇచ్చేంత వ‌ర‌కు ప్ర‌తిదీ ఓ లెక్క ప్ర‌కారం చేస్తూ వ‌చ్చారు. ఇదంతా చిన్న‌జీయ‌ర్ స్వామి వారి ఆశీర్వాద బ‌లం అని కేసీఆర్ క‌చ్చితంగా న‌మ్ముతారు. స్వామి వారంటే ఆయ‌న‌కు వ‌ల్ల‌మాలిన అభిమానం. అంత‌గా స్వామి వారి మాట‌న్నా..న‌డ‌త‌న్నా ఇష్టం. రేవంత్‌రెడ్డి వ్య‌క్తిగ‌తంగా ఎన్ని వ్యాఖ్య‌లు చేసినా..కేసీఆర్ లైట్‌గా తీసుకున్నారు. ఏకంగా అడ్ర‌స్ లేకుండా చేశారు. పాల‌న చేయ‌మంటే పూజ‌లు చేస్తూ కూర్చున్నారంటూ మోడీ చేసిన కామెంట్స్‌ను కేసీఆర్ సీరియ‌స్‌గా తీసుకున్నారు. నా ఇష్టం పూజ‌లు చేసుకుంటా..నీకేం అభ్యంత‌రం..అది నా వ్య‌క్తిగ‌తం..నీకు ఇష్ట‌మైతే ఇంటికి రా..తీర్థం, ప్ర‌సాదం ఇస్తా అని వ్యంగ్యంగా స‌మాధానం ఇచ్చారు.

అపార‌మైన విజ్ఞాన సంప‌ద‌తో..ధ‌ర్మ‌బ‌ద్ధంగా..ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కుడిగా..ఆధునిక దైవ స్వ‌రూపంగా..ఆధునిక దేవుడిగా వేలాది మంది భ‌క్తుల‌ను క‌లిగి ఉన్న చిన జీయ‌ర్ స్వామీజీ ఏది చెప్పినా కేసీఆర్ క‌చ్చితంగా పాటిస్తారు. ఆయ‌న మాటంటే కేసీఆర్‌కు వేదం..అంత‌గా గౌర‌విస్తారు. స్వామి వారి ఆశీర్వాదమే త‌న‌కు అస‌లైన బ‌ల‌మ‌ని గ‌ట్టిగా విశ్వ‌సిస్తారు . ఏది ఏమైనా..ఎన్ని సెంటిమెంట్లు ఉన్నా..కేసీఆర్ నాయ‌కుడే కాదు..అస‌మాన్యుడు..భోజ‌న ప్రియుడు..అప‌ర భ‌క్తుడు..తెలంగాణ‌కు దిశా నిర్దేశ‌నం చేసే ..దార్శ‌నికుడు..!

No comments