రాజస్థాన్‌లో వాడిపోనున్న కమలం - ఛత్తీగఢ్, మధ్యప్రదేశ్‌లో ఫిఫ్టీ ఫిఫ్టీ
ఇండియాలో ఎన్నికల ఫీవర్ హీటెక్కింది. బీజేపీ - కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. మోడీ ఛరిస్మా పనిచేస్తుందా..రాహుల్ గాంధీ మంత్రాంగం గెలిపిస్తుందా అన్నది కొద్ది గంటల్లో తేలనుంది. గత కొన్నేళ్లుగా కమళదళానికి కంచుకోటగా ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో అనూహ్యంగా హస్తం పాగా వేయబోతోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఒక్కంటే ఒక్కటి కూడా బీజేపీకి ఫేవర్‌గా పోల్స్ సర్వే వెల్లడించ లేదు. మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్‌లలో కమలం , హస్తంల మధ్య హోరీ హోరీగా పోటీ నెలకొందని స్పష్టం చేశాయి. వచ్చే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ రాష్టాలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజస్థాన్‌లో బీజేపీ తన పవర్‌ను కోల్పోనుందని..ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోనుందని వెల్లడించాయి. మిజోరంలో హంగ్ ఉంటుందని..మిగతా మూడు రాష్టాల్లో ఇపుడే ఏం చెప్పలేమని చేతులెత్తేశాయి.
రాజస్థాన్ రాష్ట్రంలో 199 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రిపబ్లిక్ టీవీ ఛానల్ ప్రకటించిన సర్వే ప్రకారం బీజేపీ 83 నుండి 103 సీట్లు కాంగ్రెస్ 81 నుండి 101 సీట్లు బీఎస్పీ, ఇతరులు మాత్రం ఎవరూ గెలవడం లేదని పేర్కొంది. టైమ్స్ నౌ ఛానల్ బీజేపీకి 85 , కాంగ్రెస్ 101 సీట్లు చేజిక్కించుకుంటాయని వెల్లడించింది. సీ ఓటర్ బీజేపీకి 60 సీట్లు వస్తాయని..కాంగ్రెస్ పారట్ఈ 137 సీట్లలో స్వీప్ చేస్తుందని ప్రకటించింది. ఇతరులు ఇద్దరు మాత్రం గెలుస్తారని తెలిపింది. ఇండియా టుడే ఛానల్ ప్రకారం బీజేపీ 55 నుంచి 72 సీట్ల మధ్య..కాంగ్రెస్ 119 నుండి 141 సీట్లు దక్కించుకుంటాయని పేర్కొంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోటీ నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది చెప్పలేక పోయాయి. మొత్తం 230 సీట్లు ఉండగా 116 సీట్లు మెజారిటీ రావాల్సి ఉంది. రిపబ్లిక్ టీవీ ప్రకారం బీజేపీకి 108 నుండి 128 సీట్లు, కాంగ్రెస్ కు 95 నుండి 115 సీట్లు, ఇతరులు 7 సీట్లలో పాగా వేస్తారని పేర్కొనగా..టైమ్స్ నౌ బీజేపీకి 126 సీట్లు, కాంగ్రెస్ 89 సీట్లు, బీఎస్పీ 6 ..ఇతరులు 9 సీట్లలో విజయం సాధించబోతున్నారని వెల్లడించింది. ఇండియా న్యూస్ ఛానల్ బీజేపీ 106 సీట్లలో కాంగ్రెస్ 112 సీట్లు, ఇతరులు 12 సీట్లలో గెలుస్తారని తెలిపింది. ఇండియా టుడే ఛానల్ బీజేపీకి 102 నుండి 120 సీట్లు వస్తాయని ..కాంగ్రెస్ పార్టీ 104 నుండి 122 సీట్లలో, బీఎస్పీ ఒకటి నుండి 3 సీట్లలో, ఇతరులు 3 నుండి 8 సీట్లలో పాగా వేస్తారని , ఏబీపీ లోక్‌నీతి బీజేపీ 94 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ 126 సీట్లలో విజయం సాధించబోతోందని వెల్లడించింది. జన్ కీ బాత్ ఛానల్ బీజేపీ 106 సీట్లతో పాగా వేయగా ..కాంగ్రెస్ 95 నుండి 115 సీట్లలో గెలవబోతోందని ప్రకటించింది.
అపారమైన వనరులు, గనులు కలిగిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎవరు పవర్లోకి వస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం ఇక్కడ 90 సీట్లున్నాయి. పవర్లోకి రావాలంటే ఇంకా 46 సీట్లు గెలుచు కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఛానల్స్ , సర్వే సంస్థలు భిన్నంగా స్పందించాయి. రిపబ్లిక్ టీవీ మాత్రం బీజేపీకి 35 నుండి 43 సీట్లు గెలవబోతోందని..కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు వస్తాయని వెల్లడించింది. టైమ్స్ నౌ ఛానల్ కాంగ్రెస్ కు 35, కమలానికి 46 సీట్లు, ఇతరులు 9 సీట్లలో పవర్లోకి వస్తారని తెలిపింది. సీ ఓటర్ సంస్థ 39 బీజేపీకి ..కాంగ్రెస్ పార్టీకి 46 సీట్లు వస్తాయని కుండ బద్దలు కొట్టింది. ఇండిపెండెంట్స్ 5 స్థానాల్లో గెలవబోతున్నారని తెలిపింది. ఇక ఇండియా టుడే ఏకంగా కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టబోతోందని ప్రకటించింది. బీజేపీకి 21 నుండి 31 రాగా..హస్తానికి మాత్రం 60 సీట్లు రాబోతున్నాయని వెల్లడించింది. ఏబీపీ న్యూస్ ఛానల్ బీజేపీకి 52 సీట్లు, కాంగ్రెస్‌కు 35 సీట్లు రానున్నాయని..ఇతరులు ఎవ్వరూ గెలవరని స్పస్టం చేసింది. జన్‌కీ బాత్ మాత్రం రెండు పార్టీలకు ఛాన్సెస్ ఉన్నాయని ప్రకటించింది. ఎవరిదో మిజోరం - మిజోరం రాష్ట్రంలో హంగ్ ఏర్పడ బోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ 14 నుంచి 18 స్థానాలు..మిజో నేషనల్ ఫ్రంట్‌కు 16 నుంచి 20 సీట్లు, ఇతరులు 3 నుంచి 10 స్థానాల్లో పాగా వేయబోతున్నారని వెల్లడించాయి. టైమ్స్ నౌ - సీఎన్ ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ 16, ఎంఎన్ ఎఫ్ 19 , ఇతరులకు ఆరు స్థానాలు రానున్నాయని ప్రకటించింది.
అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, సంఘ్ పరివార్, నరేంద్ర మోడీ ఛరిస్మా ఈసారి రాజస్థాన్‌లో పనిచేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈసారి అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. ఎలాగైనా సరే 2019 సంత్సరంలో దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో మోడీని సాగ నంపాలని ఇప్పటి నుంచే ప్లాన్స్ వేస్తున్నారు. ప్రత్యేకంగా 21 మందితో తన స్వంత టీంను ఏర్పాటు చేసుకున్నారు. కర్ణాటకలో బీజేపీకి షాక్ ఇచ్చారు. తెలంగాణలో అనూహ్యంగా టీడీపీతో చేతులు కలిపారు. చిన్న పార్టీలను గతంలో పట్టించుకోని కాంగ్రెస్ ఇపుడు వాటినే భుజానికెత్తుకుంది. రాహుల్ అన్నింటిని పక్కన పెట్టి ..పవర్ లోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కొద్ది గంటల్లో తేలబోతోంది..ఇరు పార్టీల భవితవ్యం.

Post a Comment