Header Ads

అవ్వ చేసిన పొరపాటు.. ఎయిర్‌పోర్టు మొత్తం హడల్‌..! చివరికి ఏమైందో చూస్తే నవ్వుకుంటారు.!

ముంబైకి చెందిన ఓ బామ్మ ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులను ముప్ప తిప్పలు పెట్టింది. తన పుట్టిన రోజు వేడుకల కోసం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లిన బామ్మ..తన వెంట తీసుకెళ్లిన లగేజ్ బ్యాగ్ పై ఒక అక్షరం తేడాగా రాయడంతో ఎయిర్ పోర్ట్ అధికారులకు చుక్కలు కనపడ్డాయి… ఎయిర్‌పోర్టులో దిగంగానే బామ్మ లగేజ్‌పై ఉన్న విషయాన్ని చూసిన అధికారులు హడలి పోయారు.అధికారులను హడలెత్తించే విధంగా బామ్మగారు ఏం చేసి భయపెట్టారో తెలుసా..?
ముంబై కి చెందిన వెంకటలక్ష్మి అనే పెద్దావిడ,ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో గల తన కూతురు దగ్గరకు వెళ్లారు..వెళ్లేప్పడు తీసుకెళ్లే లగేజ్ పై బాంబే టు బ్రిస్బేన్ అని రాసుకున్నారు..అక్కడే తేడా కొట్టింది..దాంతో ఆస్ట్రేలియన్ ఎయిర్ పోర్ట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు..బామ్మగారి లగేజి మొత్తం వెతికారు అయినా ఏం ఉపయోగం లేదు. అసలు విషయం ఏంటంటే.. బామ్మ తను తీసుకెళ్లే బ్యాగ్‌పై బాంబే టూ బ్రిస్బేన్‌ బదులు ‘బాంబ్‌ టూ బ్రిస్బేన్‌’ అని రాసుకుంది. అది చూసిన అధికారులు బ్యాగ్‌లో బాంబ్‌ ఉందేమోనన్న అనుమానంతో ఎయిర్‌పోర్టు మొత్తం అలెర్ట్ చేశారు. అనంతరం బామ్మను ప్రత్యేక గదిలో విచారించగా అసలు విషయం ఏంటో తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. బ్యాగ్‌పై తగిన ఖాళీ లేకపోవడం వల్ల బాంబే బదులు బాంబ్‌ అని రాసుకున్నానంటూ అధికారులకు తెలిపింది.

ఈ సంఘటనపై బామ్మ కుమార్తె జోతిరాజ్ మాట్లాడుతూ తన తల్లికి ఇంగ్లీష్‌ పూర్తిగా రాదని, చదవడం రాయడం అరకొరగా తెలుసునంటూ అధికారులకు తెలిపింది. అందుచేతనే బ్యాగ్‌పై అలా రాసుకొచ్చిందని, బాంబ్‌ అని రాయడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు తన తల్లికి తెలియవంటూ అధికారులకు వివరించింది. మొత్తానికి బామ్మగారికి ఇంగ్లీష్ రాకపోవడం వలనో,బ్యాగ్ పై చోటు లేక అలా రాయడం వలనో కాని ఆస్ట్రేలియన్ అధికారులు మాత్రం మూడు చెరువుల నీరు తాగారు..

Tweet:

https://twitter.com/siobhanheanue/status/981788797171060736

No comments