Header Ads

అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవం - అచ్యుత జీవితమే సందేశం

ప్ర‌భుత్వాలు చేయ‌లేని ప‌నిని ఓ వ్య‌క్తి ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించాడు. విద్యాభివృద్ది పేరుతో కోట్లు ఖ‌ర్చు చేస్తున్న పాల‌కులు, అధికారుల క‌ళ్లు తెరిపించేలా చేశాడు. ఎలాంటి లాభా పేక్ష లేకుండా సామాజిక బాధ్య‌తగా గిరిజ‌న బిడ్ల‌ల బ‌తుకుల్లో అక్ష‌ర వెలుగులు పూయిస్తున్న ఆ మ‌హానుభావుడి కృషిని చూసి ప్ర‌పంచం ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది. వంద‌లాది అవార్డులు ..ల‌క్క‌లేన‌న్ని పుర‌స్కారాలు అందుకున్నారు. ఆయ‌న ఈ దేశం గ‌ర్వించిన భార‌తీయుడు. మ‌ట్టిలోంచి మొల‌కెత్తిన ఈ మొక్క మ‌హా వృక్ష‌మై విస్త‌రించింది. ల‌క్ష‌లాది గిరిజ‌న బిడ్డ‌ల‌కు అక్ష‌రాలు నేర్పిస్తోంది. ఆయ‌నెవ‌రో తెలుసు కోవాల‌ని ఉందా ..అత‌డే అచ్యుత స‌మంత‌.
కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌లొంచుకునేలా స‌మంత ఏకంగా విశ్వ విద్యాల‌యాన్నే స్థాపించాడు. పేద గిరిపుత్రుల‌కు ఉచితంగా వ‌స‌తి, చ‌దువు చెప్పిస్తున్నారు. భావి భార‌త పౌరులుగా తీర్చిదిద్దుతున్నాడు. కేజీ నుండి పీజీ వ‌ర‌కు అంతా ఉచిత‌మే. బ‌ట్ట‌లు, భోజ‌నం, వ‌స‌తి, వైద్య‌మూ అన్నీ..ఒక్క‌సారి ఇందులోకి ఎంట‌ర్ అయితే చాలు..బ‌తుకు మీద బెంగ అంటూ వుండ‌దు. చ‌క్క‌ని సంస్కారం. విలువ‌లు..విజ్ఞానంతో ..ప్ర‌పంచం మెచ్చేలా ..స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేలా కొలువుల్లో కొలువు తీరుతారు.

10 కోట్ల రూపాయ‌ల‌తో క‌ళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ (కిస్‌), క‌ళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండ‌స్ట్రియ‌ల్ టెక్నాల‌జీ (కేఐఐటీ)ని స్థాపించారు సామంత‌. కేజీ నుండి పోస్టు గ్రాడ్యూయేష‌న్ దాకా..వొకేష‌న్ ట్రైనింగ్ కూడా ఇందులో ఏర్పాటు చేశారు. మెడిక‌ల్ కాలేజీ కూడా స్థాపించాడు అచ్యుత‌.

అంతేకాకుండా సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను , క‌ళ‌ల‌ను ప‌రిర‌క్షించాల‌నే స‌దుద్ధేశంతో కాదంబిని మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. 2000 నుండి మిస్ ఇండియా కాంపిటిష‌న్ నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. 25 ఆధ్యాత్మిక కేంద్రాల‌ను స్థాపించాడు. మ‌హాత్మా గాంధీ స్మృత్య‌ర్థం గాంధీ గ్రామ్ పేరుతో ఆశ్ర‌మాల‌ను ఏర్పాటు చేశాడు. గిరిజ‌నుల జీవితాల‌ను ..వారి జీవన విధానాన్ని తెలియ ప‌రిచేలా భారీ మ్యూజియంను, యోగా సెంట‌ర్‌ను రూపొందించాడు. ఇందుకు గాను స‌మంత‌కు డ‌ఫ్ఫ‌డిల్ ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ డాక్ట‌రేట్‌తో గౌర‌వించింది.

ఒడిస్సా రాష్ట్రం క‌ట‌క్ జిల్లా క‌ల‌ర‌బంక గ్రామంలో ఆనంది చ‌ర‌ణ్ స‌మంత‌, నీలిమా రాణి స‌మంత‌కు 1965లో జ‌న్మించాడు అచ్యుత స‌మంత‌. ఉత్క‌ల్ యూనివ‌ర్శిటీలో కెమిస్ట్రీ లో ఎంఎస్సీ చేశారు. ప‌లు కాలేజీల్లో పాఠాలు చెప్పారు. చ‌దువు ఒక్క‌టే వెలుగులు పంచుతుంది. జీవితాలు బాగు ప‌డాలంటే..మ‌న కాళ్ల మీద మ‌నం నిల‌బ‌డాలంటే విద్య ఒక్క‌టేన‌ని న‌మ్మారు. ఆచ‌రించి చూపారు ఆయ‌న‌. కేఐఐటీ యూనివ‌ర్శిటీని నెల‌కొల్పారు. దానికి వీసీగా ఉన్నారు.

ప్ర‌స్తుతం కార్య‌ద‌ర్శిగా ..కిస్‌ను స్థాపించారు. స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ( కేఎస్ ఓ ఎం), స్కూల్ ఆఫ్ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌, స్కూల్ ఆఫ్ కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌, స్కూల్ ఆఫ్ బ‌యో టెక్నాల‌జీ, కేఐఐటీ లా స్క‌ల్‌, కేఐఐటీ స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్‌, క‌ళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంట‌ల్ సైన్సెస్‌, క‌ళింగ పాలిటెక్నిక్ కాలేజీల‌ను స్థాపించాడు స‌మంత‌.
.
స్వ‌త‌హాగా విద్యా ప్రేమికుడు..విద్యావేత్త‌..మ‌హా మేధావి ..మాన‌వ‌తావాది అయిన ఈ సామంత ..ప‌లు ఉన్న‌త‌మైన ప‌ద‌వులు అధీష్టించారు. యూనివ‌ర్శిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ స‌భ్యుడిగా, ఏఐసీటీఇ స‌భ్యుడిగా, ఒడిస్సా సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ అక‌డ‌మిక్ కౌన్సిల్ స‌భ్యుడిగా , స‌ర్వింగ్ మెంబ‌ర్‌గా ఎన్‌సీటీఇ, ఇండియ‌న్ సొసైటీ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యూకేష‌న్ మెంబ‌ర్‌గా, ఐఎస్‌సీఏ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మెంబ‌ర్‌గా సేవ‌లందించారు.

అంత‌ర్జాతీయంగా ప‌లు సంస్థ‌ల్లో మెంబ‌ర్‌గా ఉన్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ యూనివ‌ర్శిటీ ప్రెసిడెంట్స్ స‌ర్వింగ్ మెంబ‌ర్ గా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎడ్యూకేష‌న్‌, న్యూ యార్క్ సిటీ, అసోసియేష‌న్ ఆఫ్ యూనివ‌ర్శిటీ ఏసియా ప‌సిఫిక్‌, యూనివ‌ర్శిటీ మొబిలిటి ఇన్ ఏసియా అండ్ ది ప‌సిఫిక్‌, బ్యాంకాక్‌, థాయిలాండ్‌, ఏసియా ప‌సిఫిక్ జ‌ర్న‌ల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌, యునైటెడ్ నేష‌న్స్ అక‌డ‌మిక్ ఇంపాక్ట్ , ఏసియా ఎక‌న‌మిక్ ఫోరం, దుబాయి యూనివ‌ర్శిటీలో వివిధ హోదాల‌లో ప‌ద‌వులు నిర్వ‌హించారు.

విద్యా రంగంలో ఆయ‌న చేసిన విశిష్ట సేవ‌ల‌కు గాను ప‌లు యూనివ‌ర్శిటీలు అవార్డుల‌తో స‌త్క‌రించాయి. తిరుప‌తిలోని సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ 2011లో, సౌత్ కొరియాలోని హాన్సో యూనివ‌ర్శిటీ 2010లో, కంబోడియాలోని నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ 2009లో, యూనివ‌ర్శిటీ ఆఫ్ కంబోడియా అదే ఏడాదిలో అవార్డు ప్ర‌క‌టించింది. 2002 నుండి 2005 వ‌ర‌కు ఓఐయు కొలంబియా యూనివ‌ర్శిటీ, 2012లో తైవాన్‌లోని నేష‌న‌ల్ ఫార్మోసా యూనివ‌ర్శిటీ, 2014లో బంగ్లాదేశ్ లోని డాఫోడిల్ ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ పుర‌స్కారాల‌ను అంద‌జేసింది. 2014లో కైర్గ‌స్తాన్‌లోని ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ, ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌, క‌జ‌కిస్తాన్‌లోని కైనార్ యూనివ‌ర్శిటీ, మంగోలియాలోని సైఓల్ ఎర్డెమ్ యూనివ‌ర్శిటీ, నారిన్ స్టేట్ యూనివ‌ర్శిటీ, జ‌లాబాద్ స్టేట్ యూనివ‌ర్శిటీ, 2014లో ఇరాన్‌లోని తాబ్రిజ్ యూనివ‌ర్శిటీల నుండి అవార్డులు అందుకున్నారు సామంత‌.

జ‌లాల్ అబ‌త్ స్టేట్ యూనివ‌ర్శిటీ, ఓష్ స్టేట్ యూనివ‌ర్శిటీ, త‌లాస్ స్టేట్ యూనివ‌ర్శిటీ, ఇసిక్ కుల్ స్టేట్ యూనివ‌ర్శిటీ, త‌జ‌కిస్తాన్ స్టేట్ యూనివ‌ర్శిటీ, కుల్ కోఆప‌రేటివ్ ఇనిస్టిట్యూట్‌, త‌జ‌కిస్తాన్ నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ , ఉజ్బోక్ యూనివ‌ర్శిటీ ల నుండి 2015లో అచ్యుత పుర‌స్కారాలు పొందారు. డాక్ట‌రేట్ కూడా అందుకున్నారు. సోష‌ల్ ఆంట్ర‌ప్రెన్యూర్ షిప్ రంగంలో స‌మంత లెక్క‌లేన‌న్ని అవార్డులు అందుకున్నారు. 15 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు పొందిన ఘ‌న‌త ఆయ‌న‌దే. అమెరిక‌న్ ఎడ్జ్ ఫౌండేష‌న్ నుండే అత్య‌ధిక అవార్డులు ద‌క్కాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల‌ను తిర‌గ రాశారు. యంగెస్ట్ వైస్ ఛాన్స్‌ల‌ర్‌గా రికార్డు బ్రేక్ చేశారు.

2018లో యూనివ‌ర్శిటీ ఆఫ్ కంబోడియా స‌మంత‌ను హ్యూమానిటీస్‌లో ప్రొఫెస‌ర్‌షిప్‌తో గౌర‌వించింది. మంగోళియా ప్ర‌భుత్వం బెస్ట్ వ‌ర్క‌ర్‌..టాప్ సివీలియ‌న్ అవార్డును స్వంతం చేసుకున్నారు. హ‌య్యెస్ట్ సివిలియ‌న్ అవార్డును బెహ్రెయిన్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్ సీఎస్ ఆర్ హాల్ ఆఫ్ ఫేమ్‌తో స‌త్క‌రించింది. ఎక‌నామిక్ టైమ్స్ స‌క్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూవ‌ర్ అవార్డు పొందారు. ఇంకా వంద‌లాది అవార్డులు, పుర‌స్కారాల‌ను అందుకుని త‌న రికార్డుల‌ను తానే బ్రేక్ చేశారు సామంత‌.

60కి పైగా మ‌రిన్ని దేశ‌, విదేశీ సంస్థ‌లు, యూనివ‌ర్శిటీలు అచ్యుత‌ను స‌మున్న‌తంగా స‌త్క‌రించారు. క‌ళింగ యూనివ‌ర్శిటీల ఆధ్వ‌ర్యంలో 27 , 000 వేల మందికి పైగా విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. వీరంద‌రికి ఒకే స‌మ‌యంలో భోజ‌న స‌దుపాయం అందుతుంది. ఏ ప్ర‌భుత్వం చేయ‌ని ప‌నిని విజ‌య‌వంతంగా న‌డిపిస్తున్న ఈ మ‌హానుభావుడిని చూసేందుకు దేశ‌, విదేశాల నుండి వివిధ రంగాల‌కు చెందిన వారితో పాటు అన్ని పార్టీల‌కు చెందిన అధిప‌తులు దాదాపు 15 వేల మందికి పైగా ఈ విద్యా సంస్థ‌ల‌ను సంద‌ర్శించారు. సామంత‌ను ఆలింగ‌నం చేసుకుని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

సామాజిక ప‌రివ‌ర్త‌న‌కు..సామాన్యుల సాధికార‌త‌కు విద్య ఓ ఉప‌క‌ర‌ణం అన్న‌దే అచ్యుత సామంత ఆశ‌యం.ఇదే ఆయ‌న విద్యా సంస్థ‌ల‌కు ట్యాగ్ లైన్‌. ఒక వ్య‌క్తి వేయికి పైగా పుర‌స్కారాలు అందుకోవ‌డం..అద్బుతం కాక మ‌రేమిటి..క‌దూ. సామంత‌కు స‌లాం చేయ‌కుండా ఉండ‌లేం..క‌దూ..!
Attachments area

No comments