దివ్యమైన మంగళ రూపం - భక్తుల స్వర్గ ధామం -అప్పలాయగుంట ఆలయం
ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్లండి .శ్రీ వేంకటేశ్వరుడు కొలువై వుంటాడు. కలియుగ దైవంగా తిరుపతి శ్రీనివాసుడు..అలివేలు మంగమ్మలు అత్యంత ధనవంతులైన దేవుళ్లు. నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలను దర్శించు కోవడం కొన్నేళ్ల నుండి ఆనవాయితీగా వస్తోంది. కోట్లాది రూపాయల ఆదాయం. లెక్కలేనన్ని ఆస్తులు. సంపద ఆయన స్వంతం. దివంగత ఏపీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పుణ్యమా అంటూ ఈఓ ప్రసాద్ హయాంలో అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదిప్పుడు పేదలు, ధనవంతులు అనే తేడా లేకుండా ఆకలిని తీరుస్తోంది.
పాలు, పులిహోర ఇలా ప్రతి ప్రసాదం బంగారమే. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత..ఇలా పండితులు, పామరులు, పెద్దలు , వృద్ధులు , పిల్లలు, మహిళలు..దివ్యాంగులు..అన్యమతస్తులు ఆ భగవన్నాథుని..అమ్మ వారిని దర్శించు కునేందుకు బారులు తీరి నిలబడతారు. లోకంలోనే అత్యంత సంపన్న వంతమైన, ధనవంతమైన దేవాలయంగా తిరుపతి-తిరుమల ప్రాంతం వినుతి కెక్కింది. ప్రపంచంలోని ఏ దేశం వెళ్లినా భక్తులు కనిపిస్తారు. ఆ స్వామి..అమ్మవార్లను నిత్యం స్మరిస్తూనే వుంటారు. ప్రతి తెలుగు వారి లోగిళ్లలో శ్రీనివాసుడు..అలివేలు మంగమ్మలు కొలువు తీరి వుంటారు. నిత్యం పూజలు అందుకుంటూనే వుంటారు. ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా ఆయనకు అపరితమైన రీతిలో భక్తులు ఉన్నారు. ఏ దేవుళ్లకు లేనంత లెక్కలేనంత..కొలవలేనంత కోట్ల సంఖ్యను దాటేశారు. ఇలా భక్తులు కలిగి ఉండడం ఓ రికార్డు. ఓ చరిత్ర. ఈ వేంకటశ్వరుడు తన రికార్డును తానే చెరిపి వేసుకుంటున్నాడు. క్వింటాళ్ల కొద్దీ బంగారం..లెక్కించలేనంత నోట్ల కట్టలు, నాణేలు, వెండి ఆభరణాలు, వజ్రాలు, దుస్తులు, చీరలు , గెస్ట్ హౌస్లు, గదులు, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఎన్నో సౌకర్యాలతో కొండపై కొలువుతీరి ఉన్నది.
స్వామి, అమ్మవార్లు కొలువు తీరి ఉన్న ఏ దేవాలయానికి వెళ్లినా అక్కడ శ్రీనివాసుడు చేయి కిందకు ఉంటుంది. కానీ తిరుపతికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పలాయకుంటలో కొలువై వున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుని ఆలయం మాత్రం ప్రత్యేకమైనది. విశిష్టమైనది. పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకునే భక్తులు తప్పక ఈ ఆలయాన్ని కూడా సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో ఇది ఒకటిగా పేరు పొందింది. ఇక్కడ స్వామి వారు చేయి ఎత్తి ఉంటుంది. అదే ఈ పుణ్యక్షేత్రం విశిష్టత. శ్రీ వేంకటేశ్వరుడు నారాయణ వనం లో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంట లో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరు ని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురం లో ఆరు నెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం చెబుతోంది.
ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్ధం ఒక గుంట తవ్వించాడని అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా పిలువబడింది.. కాలక్రమంలో అది అప్పలయ్య గుంటగా మారిందని చరిత్ర చెపుతోంది. అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పనిచేసిన వారికి కూలి అప్ప చెప్పకుండా ఏరోజుకు ఆరోజే ఇచ్చేవాడని అందుకనే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అదనంగా మరో కథ ప్రచారంలో ఉంది. ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంట పొలాలు ఉండడంతో వాతావరణం చాల ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాట గానే ధ్వజ స్తంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా గర్భ గుడిలో శ్రీ వారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు ప్రధాన ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉన్నంది.
ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు చేస్తారు. అనంతరం శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తారు. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు బయలు దేరుతాయి. ఇతర పుణ్య క్షేత్రాల నుండి అప్పలాయగుంట స్వామిని దర్శించు కునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. వీలైతే మీరు భక్తులైతే..ఈ ప్రశాంత వాతారణం..పచ్చదనంలో కొలువై ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకోండి. మీ కోర్కెలను తీర్చుకోండి. ధన్య జీవులై జీవించండి. స్వామీ సదా స్మరామీ అనుకుంటూ..వెళ్లడమే ఇక మిగిలింది.

Post a Comment