Header Ads

న‌వ్వులు రువ్వేవు గుండెల్ని చీల్చేవు - గౌతమ్ గంభీర్

ఎవ‌రైనా న‌వ్వ‌డం స‌హ‌జం. కానీ ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా..ప‌సిపాప న‌వ్విన‌ట్టు న‌వ్వ‌డం మ‌న‌కు సాధ్యం కాదు. ఎంతో ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన జీవితం గ‌డిపితే త‌ప్పా. పెద‌వుల మీద చెర‌గ‌ని నవ్వు ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్యం. ఇదేదో సినిమా గురించి కాదు..ఇండియాకు క్రికెట్‌లో ఎన‌లేని విజ‌యాల‌లో కీల‌క భూమిక పోషించిన గౌతం గంభీర్ గురించి. ఎంత వ‌త్తిడి లోనైనా స‌రే మోహంలో న‌వ్వును కాపాడుకుంటూ వ‌స్తున్న ఆట‌గాళ్ల‌లో ఇత‌డొక్క‌డే. ఎక్క‌డికి వెళ్లినా..ఏ ఫార్మాట్‌లో ఆడినా..ఓట‌మి అంచుల్లో ఉన్నా..మ్యాచ్ ఉత్కంఠ రేపుతున్నా..అమాయ‌కంగా న‌వ్వుతూనే ఆడ‌డం ఈ క్రికేట‌ర్‌కే చెల్లింది.


 న‌వ్వ‌డం అదృష్టం..న‌వ్వక పోవడం ఓ రోగం. అజారుద్దీన్ మ‌ణిక‌ట్టు..క‌పిల్‌దేవ్ బౌలింగ్‌..స‌చిన్ సిక్స్‌..కోహ్లి విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్‌..ధోనీ డేరింగ్‌..ద్ర‌విడ్ కీపింగ్‌..ఇలా ప్ర‌తి ఒక్క‌రిదీ ఒక్కో స్ట‌యిల్‌. కానీ గౌతం గంభీర్ మాత్రం న‌వ్వే ఆభ‌ర‌ణం. ఆడే సామ‌ర్థ్యం ఉన్న‌ప్ప‌టికీ ఎందుక‌నో ఉన్న‌ట్టుండి క్రికెట్ రంగం నుండి నిష్క్ర‌మిస్తున్నాన‌నంటూ గంబీర్ ప్ర‌క‌టించారు. క్రికెట్ అభిమానుల‌కు షాక్ ఇచ్చారు. 1981లో జ‌న్మించిన ఇత‌ను ఎడ‌మ‌చేతి బ్యాట్స్‌మెన్‌. ఐపీఎల్‌లో కోల్‌కొతా నైట్ రైడ‌ర్స్ త‌ర‌పున ఆడాడు. 2003లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అదే ఏడాది ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆరు మ్యాచ్‌ల‌కు కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. 2007లో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క్రికెట్ క‌ప్‌, 2011లో జ‌రిగిన ప్ర‌పంచ క్రికెట్ క‌ప్‌లో ఆడాడు.

అయిదు టెస్టుల్లో వ‌రుస‌గా సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. 2008లో యుపీతో జ‌రిగిన రంజీ మ్యాచ్‌లో 130 ప‌రుగులు సాధించాడు. వ‌న్డేలు, టెస్ట్ మ్యాచ్‌లు ఆడి అద్బుత‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు గంబీర్‌. 7, 25, 000 ల డాల‌ర్ల‌తో ఐపీఎల్‌లో వేలం పాట‌లో గంబీర్‌ను చేజిక్కించుకున్నారు. ఆ త‌ర్వాత జ‌రిగిన టోర్నీలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ గంబీర్‌ను ఎంచుకుంది. అల‌వోక‌గా ప‌రుగులు సాధించ‌డం గంబీర్‌కు వెన్న‌తో పెట్టిన విద్య. ఫాస్ట్ , స్పిన్ బౌలింగ్‌ల‌ను ఎదుర్కొని సిక్స‌ర్ల‌ను అవ‌లీలగా సాధించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఈ ఏడాది జ‌రిగిన ఐపీఎల్ వేలం పాట‌లో ఏకంగా గంబీర్‌ను 2.8 కోట్ల‌కు ద‌క్కించుకున్నారు. ఆట‌గాడిగా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉండ‌డం ఆయ‌న‌కు ఇష్టం. కొన్ని కాంట్రోవ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేయ‌డం కూడా ఆయ‌న‌కే చెల్లింది. కుండ బ‌ద్ద‌లు కొట్ట‌డం గంబీర్ నైజం. ఎంతో మంది ఆట‌గాళ్ల ను త‌ట్టుకుని త‌న‌కంటూ ఓ స్థానాన్ని ఏర్ప‌ర్చుకున్న ఘ‌న‌త గంబీర్‌దే.

భుజానికి గాయం కావ‌డంతో 2008లో ఆస్ట్రేలియా టీంతో టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఆ త‌ర్వాత శ్రీ‌లంక జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌ల్లో బెస్ట్ ఫ‌ర్మారెన్స్ ప్ర‌ద‌ర్శించారు. గ‌బ్బా మైదానంలో 102 ప‌రుగులు సాధించాడు. మ‌రో 113 ప‌రుగులు చేశాడు. ఈ సీరీస్‌లో 440 ప‌రుగుల‌తో ఫ‌స్ట్‌లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్నారు. అక్క‌డి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఇక్క‌డ కూడా 445 ప‌రుగులు చేశాడు. శ్రీ‌లంక‌తో జ‌రిగిన హోం సిరీస్‌లో మొద‌టి టెస్ట్‌లోనే దుమ్ము రేపాడు. సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

చిట్ట‌గాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 116 ప‌రుగులు చేశాడు. వివియ‌న్ రిచ‌ర్డ్స్‌, డాన్ బ్రాడ్‌మెన్ చేసిన ప‌రుగుల‌ను గంబీర్ దాటారు. 2010లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌ల‌కు గౌతం గంబీర్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. కోల్‌క‌తాలో జ‌రిగిన మ్యాచ్‌లో 160 ప‌రుగులు చేశాడు. టెస్ట్‌లు, వ‌న్డేలు..ఫ‌స్ట్ క్లాస్‌, టీ 20 మ్యాచ్‌ల నుండి వైదొలుగుతున్న‌ట్లు గంబీర్ ప్ర‌క‌టించారు. ఎందుక‌నో ఇటీవ‌లే ధోనీపై విమ‌ర్శ‌లు గుప్పించాడు. ఎంతో ప్ర‌తిభావంత‌మైన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ..అంద‌మైన న‌వ్వు ఇక మైదానంలో క‌నిపించ‌దు. ఏ స‌మ‌యంలోనైనా కూల్‌గా ఉంటూ ఆడే ఈ ఆట‌గాడు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం బాధాక‌రం.

No comments