అందరి చూపు అమరావతి వైపు - ఊపందుకున్న బిజినెస్
ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉండేందుకు దూసుకు పోతోంది. స్పష్టమైన విజన్ , అభివృద్ధి కోసం ముందు చూపుతో వ్యవహరించే పేరున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని కేపిటల్ సిటీగా ప్రకటించారు. అప్పటి నుంచి నేటి దాకా వేల కోట్లతో ప్రణాళిక తయారు చేశారు. అన్ని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలను ఇప్పటికే సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వుండేలా తీర్చిదిద్దారు.
నిరంతరం ఐటీ జపం చేసే చంద్రబాబు ఆ దిశగా ప్రపంచ వ్యాప్తంగా ..వ్యాపార పరంగా ప్రసిద్ధి చెందిన కంపెనీలు ఏపీకి వచ్చేలా కృషి చేశారు. తన కుమారుడు నారా లోకేష్‌కు ఇన్మర్మేషన్ టెక్నాలజీ శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖలను కేటాయించారు. ఈ రెండూ ప్రభుత్వానికి రెండు కళ్లు. అమెరికాలో వుండి మేనేజ్మెంట్, ఐటీ సెక్టార్లలో పరిజ్ఞానం సంపాదించుకున్న లోకేష్‌కు అనుభవం ఉన్నది. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే తనకు అప్పగించిన శాఖలను మరింత సమన్వయం చేసుకుంటూ..పనిచేసే ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా ఐటీ , మేనేజ్మెంట్ రంగాలలో ఎక్స్‌పర్ట్స్‌ను ప్రత్యేకించి తెచ్చుకున్నారు. దీంతో అమరావతి ఐటీ పరంగా ..వ్యాపార పరంగా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. వ్యాపారవేత్తలను ఆకర్షించేలా చేశారు. పలు కంపెనీలతో ఎంఓయు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా దేశవ్యాప్తంగా ఎంతో పేరున్న కంపెనీలు, సంస్థలు అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే ప్రజల అభిరుచులకు అనుగుణంగా ..అత్యంత సౌకర్యవంతంగా ఫ్లాట్లు, ఇండిపెండెంట్ గృహాలు, విల్లాస్లు..ప్లాట్లు నిర్మించారు.
ప్రభుత్వం ప్రత్యేకించి తక్కువ ధరలో ఇండ్లను నిర్మిస్తోంది. దీనికి అందరికి అందుబాటులో ఉండేలా వేలం పాట ద్వారా కేటాయింపులు జరిపారు. హ్యాపీ హోమ్స్ పేరుతో ప్రకటించిన వేలానికి అనూహ్యమైన రీతిలో స్పందన వచ్చింది. ప్రవాస భారతీయులు ఎక్కువగా అమెరికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఫ్రాన్స్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్, బ్యాంకాక్, తదితర దేశాల్లో అత్యధికంగా నివసిస్తున్నారు. వీరిలో తెలంగాణ ప్రాంతం వారి కంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. పీనెస్ట్లోని ఫ్లాట్లు హాట్కేకులని మరోసారి రుజువైంది. ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో అమరావతిలో ప్రప్రథమంగా నిర్మితమవుతున్న ఈ ప్రజానివాస సముదాయానికి అన్ని వర్గాల నుండి విశేషమైన స్పందన లభించింది. నవంబరు 9న తొలి విడత ఆన్లైన్ బుకింగ్‌లో 300 ఫ్లాట్లు సాయంత్రానికల్లా అయిపోగా.. రెండో విడతలో భాగంగా అందుబాటులో ఉంచిన 900 ఫ్లాట్లు 129 నిమిషాల్లోనే అమ్ముడు పోయి ..రికార్డులు సృష్టించాయి. దీంతో హ్యాపీనెస్ట్ కు విపరీతమైన డిమాండ్ ఉందని మరోసారి నిరూపితమైంది.
ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైన తొలి 15 నిమిషాల్లోనే ఏకంగా 600 ఫ్లాట్లు బుక్కయి పోయాయి. అరగంటలో 742 ఫ్లాట్లు ఫుల్‌అయ్యాయి. తొలి ఫ్లాట్‌ను విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా ఆ నగరానికే చెందిన పద్మ బుక్ చేసుకున్నారు! సాంకేతిక కారణాల వలన ఆ తర్వాత అది రద్దవడంతో ఆమె నిరాశ చెందారు. కానీ.. రెండో విడతలో మాత్రం ఆమె అందరికంటే ముందు ఫ్లాటును దక్కించుకోవడం విశేషం.ఊహించని రీతిలో సర్కార్ ప్రవేశ పెట్టిన హ్యాపీ హోమ్స్‌కు ఆదరణ లభించడంతో ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇండ్లను ప్రజలకు అందివ్వాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల భారీ ఆదాయం సమకూరింది. అమరావతితో పాటు విజయవాడ, రాజమండ్రి, గన్నవరం, గుంటూరు, మంగళగిరి, విశాఖపట్టణం, అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు తదితర ప్రధాన నగరాల్లో కూడా హ్యాపీ హోమ్స్ ..ప్రజలందరికి అందుబాటులోకి రానున్నాయి. అభివృద్ధి మంత్రం ..లీడర్షిప్ ..బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా పేరున్న బాబు మరోసారి అధికారంలోకి వస్తే అమరావతి మరో సైబర్ సిటీ కానుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Post a Comment